Google Pixel 8a : ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ అదిరింది.. గూగుల్ పిక్సెల్ 8aపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి!
Google Pixel 8a : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ 8aపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 8a
Google Pixel 8a : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? సరసమైన ధరకే కొత్త పిక్సెల్ 8a ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ కాంపాక్ట్ డిజైన్, పవర్ ఫుల్ కెమెరాలు, క్లీన్ యూజర్ (Google Pixel 8a) ఇంటర్‌ఫేస్, ఏఐ-ఆధారిత ఫీచర్లతో వస్తుంది. మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే పిక్సెల్ 8a ఫోన్ కొనేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22వేలు తగ్గింపుతో లభ్యమవుతుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8a డీల్ :
ఈ పిక్సెల్ 8a ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 52,999కు లాంచ్ కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.37,999కే లిస్ట్ అయింది. అసలు లాంచ్ ధర కన్నా రూ.15వేలు తక్కువకే అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై అదనంగా రూ.7వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
దాంతో ఈ పిక్సెల్ ఫోన్ రూ.30,999కి తగ్గుతుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో నెలకు కేవలం రూ. 1,584తో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి ఫ్లిప్‌కార్ట్ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ.29,200 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 8a కీలక స్పెసిఫికేషన్లు :
పిక్సెల్ 8a ఫోన్ 6.1-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 8GB LPDDR5x ర్యామ్, 128GB/256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ పిక్సెల్ 8a ఫోన్ 64MP క్వాడ్ PD ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. అయితే, 13MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ పిక్సెల్ ఫోన్‌కు 4,492mAh బ్యాటరీ, 72 గంటల వరకు ఛార్జింగ్ అందిస్తుంది.