Luxury Car Sales 2024 : 2024 ఏడాదిలో లగ్జరీ కార్ల అమ్మకాల రికార్డు.. ప్రతి గంటకు 6 లగ్జరీ కార్ల విక్రయాలు..

Luxury Car Sales 2024 : లగ్జరీ కార్ల ధర రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే.. ప్రతి 10 నిమిషాలకు ఒక లగ్జరీ కార్ సేల్ అవుతుందని చెప్పవచ్చు.

Over 6 high-end cars sold every hour in India in Over 6 high-end cars sold every hour in India in 20242024

Luxury Car Sales 2024 : చౌక కార్ల రోజులు ముగిసినట్టేనా? 2024 సంవత్సరంలో లగ్జరీ కార్లకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు.. ఈ ఏడాదిలో ప్రతి గంటకు 6 లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయని, ఈ లగ్జరీ కార్ల ధర రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే.. ప్రతి 10 నిమిషాలకు ఒక లగ్జరీ కార్ సేల్ అవుతుందని చెప్పవచ్చు. ఈ కార్లలో ఆడి, మెర్సిడెస్-బెంజ్ వంటి పెద్ద బ్రాండ్‌ల కార్లు ఉన్నాయి.

Read Also : iPhone 16 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్!

గణాంకాల ప్రకారం.. 5ఏళ్ల క్రితం ప్రతి గంటకు విక్రయించే లగ్జరీ కార్ల సంఖ్య కేవలం రెండు మాత్రమే. అలాంటి పరిస్థితిలో ఈ 5 ఏళ్లలో మూడు రెట్లు పెరిగింది. సంపన్న వర్గం విస్తరించడమే ఇందుకు కారణం. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. లగ్జరీ కార్ల తయారీదారులు 2025 సంవత్సరంలో రెండు డజనుకు పైగా కొత్త వాహనాలను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

2025 సంవత్సరం ఎలా ఉండనుంది? :
పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2025 సంవత్సరంలో లగ్జరీ కార్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. 2025లో లగ్జరీ కార్ల విక్రయాలు 50 వేల మార్కును దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ డిలియన్ మాట్లాడుతూ.. ‘2025లో పరిశ్రమ 8 నుంచి 10శాతం చొప్పున వృద్ధి చెందుతుందని భావిస్తున్నాము’ అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘2025 సంవత్సరంలో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది’ అని అన్నారు.

high-end cars sold in India 2024

2024లో లగ్జరీ కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే? :
ఈ ఏడాది కూడా లగ్జరీ కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2024లో మెర్సిడెస్ బెంజ్ కార్ల విక్రయాల సంఖ్య 20 వేలకు చేరుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన 9 నెలల్లో 14,379 యూనిట్ల విక్రయాల్లో 13శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో, జనవరి, సెప్టెంబర్ మధ్య బీఎండబ్ల్యూ ఇండియా అమ్మకాలు దాదాపు 5శాతం పెరిగి రికార్డు స్థాయిలో 10,556 వాహనాలకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది అమ్మకాలను మళ్లీ పెంచుకోబోతున్నట్లు ఆడి ఇండియా వెల్లడించింది.

లగ్జరీ కార్ల అమ్మకాల పెరుగుదల ఎందుకంటే? :
దేశంలో బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ ‘ది వెల్త్ రిపోర్ట్ 2024’ ప్రకారం.. అల్ట్రా-రిచ్ భారతీయుల సంఖ్య 2023లో 1,3263 నుంచి 2028లో 1,9908కి 50శాతం పెరుగుతుందని అంచనా. భారత్ తర్వాత చైనా (47శాతం), టర్కీ (42.9శాతం), మలేషియా (35శాతం) ఉన్నాయి. దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరగడంతో లగ్జరీ కార్ల విక్రయాలు పెరిగాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Vivo X200 Ultra Launch : వివో X200 అల్ట్రా ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ లీక్.. భారత్‌కు ఈ మోడల్ వస్తుందా?