Petrol, Diesel Price Hike : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ..హైదరాబాద్ లో ఎంతంటే ….

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపధ్యంలో  అంతర్జాతీయంగా   క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత్ లోనూ పెట్రో ధరల బాదుడు మొదలైంది.

Petrol, Diesel Price Hike :  రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపధ్యంలో  అంతర్జాతీయంగా   క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత్ లోనూ పెట్రో ధరల బాదుడు మొదలైంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

ఢిల్లీలో 80 పైసలు చొప్పున పెట్రోల్, డీజిల్ పై ధరలు పెరిగాయి దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.21, డీజిల్ రూ.87.47 అయ్యింది. మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ పై84 పైసలు, డీజిల్ పై 86 పైసలు పెరిగింది. దాదాపు 137 రోజుల తర్వాత చమురు సంస్ధలు ధరలు పెంచాయి. 2021 నవంబర్ 4న చివరి సారిగా పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్ధలు పెంచాయి.

కాగా హైదరాబాద్ లో ఈ ధరలు…  పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 88 పైసలు పెంచుతున్నట్లు డీలర్లకు సమాచారం అందింది. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చాయి.కొన్నినెలకు ముందు భారత్ లో చమురు ధరలు గరిష్ట స్ధాయికి చేరుకోవటంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 10 డీజిల్ పై రూ.5 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
Also Read : Facebook: యాక్టివేట్ చేసుకోపోతే ఫేస్‌బుక్ లాక్ అయిపోయినట్లే
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత పలు రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించటంతో వినియోగదారులకు ఊరట లభించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ ను తగ్గించనివిషయం తెలిసిందే. ప్రస్తుతం పెరిగిన రేట్లతో హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ రూ.109.10 డీజిల్ రూ.95.49కి చేరింది.

ట్రెండింగ్ వార్తలు