Facebook: యాక్టివేట్ చేసుకోపోతే ఫేస్‌బుక్ లాక్ అయిపోయినట్లే

మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌లో స‌మ‌స్య‌లు వస్తుంటే.. ఫేస్‌బుక్ అకౌంట్ ప్రొటెక్ట్ యాక్టివేట్ చేసుకున్నారా అని ఓ సారి చెక్ చేసుకోండి. ఫేస్‌బుక్ ప్రొటెక్ట్ అనే ఓ ఫీచ‌ర్‌ను రీసెంట్ గా..

Facebook: యాక్టివేట్ చేసుకోపోతే ఫేస్‌బుక్ లాక్ అయిపోయినట్లే

Facebook

Facebook: మీ ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్‌లో స‌మ‌స్య‌లు వస్తుంటే.. ఫేస్‌బుక్ అకౌంట్ ప్రొటెక్ట్ యాక్టివేట్ చేసుకున్నారా అని ఓ సారి చెక్ చేసుకోండి. ఫేస్‌బుక్ ప్రొటెక్ట్ అనే ఓ ఫీచ‌ర్‌ను రీసెంట్ గా తీసుకురావడంతో తప్పనిసరిగా అప్‌డేట్ అవ్వాల్సిన అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచ‌ర్‌గా మారిపోయింది. ప్ర‌తి ఒక్క యూజ‌ర్ యాక్టివేట్ చేసుకోవాల‌ని దీనిపై మెటా అధికారిక స్టేట్మెంట్ వెల్ల‌డించింది.

Two factor authenticationతో ఫేస్‌బుక్ ప్రొటెక్ట్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలారోజుల ముందే మీ అకౌంట్‌కు అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచ‌ర్ అయిన ఫేస్‌బుక్ ప్రొటెక్ట్‌ను మార్చి 17 లోపు యాక్టివేట్ చేసుకోమంటూ యూజ‌ర్ల‌ందరికీ మెయిల్స్ పంపింది ఫేస్‌బుక్.

యూజ‌ర్ల అకౌంట్ల‌ు ప్రొటెక్ట్ యాక్టివేట్ చేసుకోకపోతే అవన్నీ లాక్ అయిపోతాయి. ఇప్ప‌టికే కొంద‌రి అకౌంట్ల‌ను లాక్ అయిపోయాయి. ఒక‌సారి లాక్ అయిపోతే వాళ్లు ఇక లాగిన్ కాలేరు. మీ అకౌంట్‌ను కూడా లాక్ అవక‌ముందే వెంట‌నే ఫేస్‌బుక్ ప్రొటెక్ట్ ఫీచ‌ర్‌ను యాక్టివేట్ చేసుకోండి.

Read Also: 200 అకౌంట్లు డిలీట్ చేసిన ఫేస్‌బుక్

  1. ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేసి రైట్‌సైట్ ఉన్న డ్రాప్ డౌన్ ఆరో మీద క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్స్ అండ్ ప్రైవ‌సీ ఆప్ష‌న్ మీద క్లిక్ చేసి మ‌ళ్లీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి.
  3. ఫేస్‌బుక్ ప్రొటెక్ట్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేస్తే వెల్‌క‌మ్ స్క్రీన్ క‌నిపిస్తుంది.
  4. ఫేస్‌బుక్ ప్రొటెక్ట్ బెనిఫిట్స్ స్క్రీన్ తర్వాత ఫేస్‌బుక్ ప్రొటెక్ట్ ఆప్ష‌న్‌ను ట‌ర్న్ ఆన్ చేయాలి.
  5. టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్‌లో భాగంగా స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  6. ఫిక్స్ నౌవ్ అనే బ‌ట‌న్ మీద క్లిక్ చేస్తే చాలు.. ఫేస్‌బుక్ ప్రొటెక్ట్ ఆప్ష‌న్ యాక్టివేట్ అయిపోయినట్లే.