చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన ఎనిమది రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం లీటర్ పెట్రోల్ రూ. 78.80లకు ఉండగా..డీజిల్ ధర రూ. 73.11గా ఉంది.
సెప్టెంబర్ 01 నుంచి ఈ ధరలే అత్యధికం కావడం గమనార్హం. గడిచిన ఎనిమిది రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ. 2.33, డీజిల్‌పై రూ. 1.78గా పెరిగింది. ఇటీవల కాలంలో ఇంత పెద్దమొత్తంలో పెరగడం ఇదే ఫస్ట్ టైమ్. కొద్ది రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న క్రమంలో ధరలు తగ్గుముఖం పడుతాయనే ఆశలో ఉన్నారు వాహనదారులు.
సౌదీ ఆరామ్ డ్రోన్ దాడి ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. సౌదీ అరేబియాలోని అబ్‌కైక్, ఖురైస్‌లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై ఇటీవలే యెమనీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయిల్ రిఫైనరీ పై దాడుల కారణంగా చమురు శుద్ధి ప్రక్రియకి భారీ ఆంటంకం ఏర్పడింది. దాడులతో ఆ దేశం చమురు ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. దీనితో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 20 శాతం వరకు పెరిగిపోయాయి. మరోవైపు భారత్‌కు రెండో అతి పెద్ద చమురు సరఫరాదారు సౌదీ అరేబియానే. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఆరు శాతం ఆరాంకో నుంచే జరుగుతోంది.
సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం ధరలు ఇలా ఉన్నాయి : –
నగరం | పెట్రోల్ | డీజిల్ |
ఢిల్లీ | రూ. 74.13 | రూ. 67.07 |
కోల్ కతా | రూ. 76.82 | రూ. 69.49 |
చెన్నై | రూ. 77.07 | రూ. 70.92 |
ముంబై | రూ. 79.79 | రూ. 70.37 |
బెంగళూరు | రూ. 76.67 | రూ. 69.36 |
హైదరాబాద్ | రూ. 78.80 | రూ. 73.11 |
చిత్తూరు | రూ. 78.55 | రూ. 72.47 |
కడప | రూ. 78.27 | రూ. 72.23 |
విశాఖపట్టణం | రూ. 77.49 | రూ. 71.49 |
విజయనగరం | రూ. 77.71 | రూ. 71.69 |
అనంతపురం | రూ. 78.31 | రూ. 72.29 |
Read More : ఆ రోజులు పోయాయి… చైనాకి ట్రంప్ స్వీట్ వార్నింగ్