PF Pension : PF ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. రిటైర్మెంట్ తర్వాత మీకు ఎంత పెన్షన్ వస్తుందంటే? ఫుల్ డిటెయిల్స్..!

PF Pension : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ తర్వాత ఈపీఎస్ నుంచి ఎలా పెన్షన్ పొందాలి? ఎంత వరకు పెన్షన్ పొందుతారంటే?

PF Pension

PF Pension : పెన్షనర్లకు శుభవార్త.. ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి జీవితం సాఫీగా సాగేందుకు ముందుగానే ఒక ప్లాన్ వేసుకుంటారు.

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈపీఎస్ నుంచి పెన్షన్ పొందుతారు. ప్రతి నెలా ఉద్యోగుల ఖాతాల నుంచి కొంత మొత్తాన్ని జమ చేస్తారు.

Read Also : iQOO Neo 10 Price : ఐక్యూ నియో 10 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు ఇవేనా?

కంపెనీ నుంచి అదే మొత్తాన్ని EPF ఖాతాలో జమ చేస్తారు. పదవీ విరమణ తర్వాత EPF సభ్యులు ఎంత పెన్షన్ పొందుతారో ఉదాహరణలతో వివరంగా చూద్దాం..

మీకు 25 ఏళ్లు, మీ ప్రాథమిక జీతం రూ. 20 వేలు ఉంటే.. 20వేలు ×12శాతం = రూ. 2,400 ప్రతి నెలా EPF ఖాతాలో జమ అవుతుంది.

కంపెనీ కాంట్రిబ్యూషన్ రూ. 20,000×12శాతం = రూ. 2,400. ఇందులో ఈపీఎస్ : 15,000 × 8.33శాతం = రూ. 1,250, (EPS గరిష్ట జీతం రూ. 15 వేలపై లెక్కిస్తారు ). 2,400–1,250 = రూ. 1,150 ఈపీఎఫ్‌‌లో జమ అవుతుంది.

ఈపీఎఫ్‌లో మొత్తం : రూ.2,400 (ఉద్యోగి) + రూ.1,150 (కంపెనీ) = నెలకు రూ.3,550 జమ చేస్తారు. ఈపీఎస్‌లో నెలకు రూ.1,250 జమ చేస్తారు. 35 ఏళ్ల తర్వాత, అంటే ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా రూ.3,550 లెక్కిస్తే.. అది ఏడాదికి రూ.42,600 అవుతుంది.

మీరు 35 ఏళ్ల పాటు ప్రతి ఏడాది 8.25 శాతం వడ్డీతో రూ. 42,600 లెక్కిస్తే.. అది రూ. 68.9 లక్షలు అవుతుంది. మీ డబ్బు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మొదటి ఏడాదిలో మీకు రూ. 42,600పై 8.25శాతం వడ్డీ లభిస్తుంది.

మరుసటి ఏడాది మీకు వడ్డీతో పాటు మునుపటి డబ్బు కూడా లభిస్తుంది. మీరు ఇలా లెక్కిస్తే.. 35 ఏళ్ల సర్వీస్‌లో ఆ మొత్తం రూ. 68.9 లక్షలకు చేరుకుంటుంది. ప్రతి నెలా రూ.1,250 ఈపీఎస్‌లో జమ అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అవుతుంది.

పెన్షన్ = (సర్వీస్ సంవత్సరాలు × సగటు జీతం) ÷ 70. రూ.15 వేలుగా లెక్కిస్తే.. పెన్షన్ = (35×15,000) ÷ 70 = 5,25,000 ÷ 70 అంటే.. నెలకు రూ. 7,500 అనమాట.

ఈపీఎఫ్ నుంచి రూ.68.9 లక్షలు, ఈపీఎస్ నుంచి నెలకు రూ.7,500. మొత్తం పెన్షన్ ఒకేసారి తీసుకోలేరు. మీరు రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్లు (60 ఏళ్లు 80 సంవత్సరాల మధ్య) ఉంటే.. 7,500×12×20=రూ.18 లక్షలు పెన్షన్‌గా అందుకుంటారు.

అప్పుడు మొత్తం ప్రయోజనం రూ.68.9 లక్షలు + రూ.18 లక్షలు = రూ.86.9 లక్షలు. కానీ ఇది కేవలం ఒక అంచనా మాత్రమే.

Read Also : Pixel 10 Pro vs Pixel 9 Pro : పిక్సెల్ 10ప్రో సిరీస్ వస్తోంది.. పిక్సెల్ 9ప్రో కన్నా బెటర్ ఫీచర్లతో.. ఏయే అప్‌గ్రేడ్స్ ఉండొచ్చంటే?

మీరు ఎక్కువ కాలం జీవిస్తే.. మీకు ఎక్కువ పెన్షన్ లభిస్తుంది. జీతం పెరగడంతో EPF, EPS ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. అప్పుడు, ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత పొందే మొత్తం కూడా భారీగా పెరుగుతుంది.