Unpaid : సమ్మెలోకి జెట్ ఎయిర్‌వేస్ పైలెట్లు

Jet Airways లో మరో సంక్షోభం రానుంది. ఆ సంస్థకు చెందిన పైలట్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. బాకీగా ఉన్న వేతనాలను చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

  • Publish Date - March 30, 2019 / 04:58 AM IST

Jet Airways లో మరో సంక్షోభం రానుంది. ఆ సంస్థకు చెందిన పైలట్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. బాకీగా ఉన్న వేతనాలను చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

Jet Airways లో మరో సంక్షోభం రానుంది. ఆ సంస్థకు చెందిన పైలట్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. బాకీగా ఉన్న వేతనాలను చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పలు విమానాల సర్వీసులు నిలిచిపోయే ఛాన్స్ ఉంది. పైలెట్లకు నాలుగు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కష్టాల్లో మునిగి, నష్టాల నుంచి తేరుకునే మార్గం కోసం వెతుక్కుంటున్న జెట్ ఎయిర్ వేస్‌కు మరింత కష్టాలు రానున్నాయి. 
Read Also : బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ

జెట్ ఎయిర్ వేస్‌ని గట్టెక్కించేందుకు త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందని అందరూ భావించారు. ఈ సంస్థకు రుణదాతగా ఉన్న SBH, ఇతర బ్యాంకులు రుణాలిస్తాయని ప్రచారం జరిగింది. అయితే..SBH నుండి నిధులు రాకపోవడంతో పైలెట్లకు సకాలంలో వేతనాలు చెల్లించలేకపోయింది.

యాజమాన్య వైఖరికి నిరసిస్తూ ఏప్రిల్ 1వతేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్, జెట్ ఎయిర్‌వేస్ రిజిస్టర్డు పైలెట్ల యూనియన్ ప్రకటించింది. మార్చి 31వ తేదీలోగా చెల్లించాలని డెడ్ లైన్ విధించింది. అప్పటిలోగా జీతాలు చెల్లించకుంటే జెట్ ఎయిర్‌వేస్ విమానాలను నిలిపివేస్తామని యూనియన్ హెచ్చరించింది. 

లీజుదారులకు చెల్లింపులు, అద్దెలు కట్టలేకపోతోంది జెట్ ఎయిర్ వేస్. ఇక సిబ్బంది జీతాల విషయం సరేసరి. వారికి వేతనాలు కూడా చెల్లించడం లేదు. దీని కారణంగా విమానాల సర్వీసులను సంస్థ నిలిపివేస్తోంది. కొన్ని కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల సంస్థను మళ్లీ గాడిలో పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది జెట్ ఎయిర్ వేస్.  
Read Also : మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?