PM Kisan 19th Installment Date
PM Kisan 19th Installment Date : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? అయితే, మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం 19వ విడత చివరకు ఫిబ్రవరి చివరి వారంలో విడుదల కానుంది.
నివేదిక ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బీహార్‌లోని భాగల్పూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ 19వ విడతను విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ వ్యవసాయ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు వివిధ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ పథకం 18వ విడత అక్టోబర్ 2024లో విడుదలైంది. ఇందులో మొత్తం 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.20వేల కోట్లు జమ చేశారు.
పీఎం కిసాన్ స్కీమ్ అంటే ఏంటి? :
ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2వేల చొప్పున సంవత్సరానికి రూ. 6వేలు చొప్పున అందిస్తారు. ఈ డబ్బును ప్రతి సంవత్సరం 3 విడతలుగా అందిస్తారు. ప్రధానంగా ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి మధ్య ఉంటుంది.
ఈ పీఎం కిసాన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేస్తారు. ఈ పథకాన్ని 2019 తాత్కాలిక బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ఆ తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకంగా అవతరించింది.
పీఎం కిసాన్ అర్హత వివరాలివే :
పీఎం కిసాన్ 19వ విడతకు అర్హత పొందాలంటే ఈ కింది నిబంధనలను కలిగి ఉండాలి.
* భారతీయ పౌరుడు
* సాగు భూమి
* చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి.
* నెలకు కనీసం రూ. 10వేల పెన్షన్ పొందే రిటైర్డ్ వ్యక్తి కాకూడదు.
* ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి కాకూడదు
* సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు
పీఎం కిసాన్ స్కీమ్ ఈ-కెవైసీ చేశారా? :
పీఎం కిసాన్ వాయిదాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా (e-KYC)ని పూర్తి చేయాలి. పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం “PMKISAN రిజిస్టర్ అయిన రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. లేదంటే బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చు”.
పీఎం కిసాన్.. లబ్ధిదారుడి స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
1) అధికారిక వెబ్‌సైట్‌ను (pmkisan.gov.in) విజిట్ చేయండి.
2) ఇప్పుడు, పేజీలో కుడి వైపున ‘Know Your Status’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3) మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి, కాప్చా కోడ్‌ను కూడా వేయండి. ‘Get Data’ ఆప్షన్ ఎంచుకోండి.
మీ లబ్ధిదారుడి స్టేటస్ స్ర్కీన్‌పై కనిపిస్తుంది.
పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేసుకోండి :
పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బుల కోసం దరఖాస్తు చేయాలంటే? :