JioHotstar Merger : గతంలో జియో, హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారా? ఇప్పుడు రెండూ కలిసిపోయాయ్.. మీ పరిస్థితి ఏంటి? చెక్ చేసుకోండి..

JioHotstar Merger : మీరు ఇప్పటికే జియో, హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారా? ఈ రెండు ఒకే యాప్‌లోకి మారిపోయాయి. మీ సబ్‌స్ర్కిప్షన్ కొనసాగుతుందా? లేదో ఇలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.

JioHotstar Merger : గతంలో జియో, హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారా? ఇప్పుడు రెండూ కలిసిపోయాయ్.. మీ పరిస్థితి ఏంటి? చెక్ చేసుకోండి..

JioHotstar Launch

Updated On : February 15, 2025 / 4:46 PM IST

JioHotstar Merger : రిలయన్స్ జియో, డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్ర్కైబర్లకు అలర్ట్.. గతంలో మీరు రెండింటిలో ఏదైనా సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారా? అయితే ఇది మీకోసమే.. ఎందుకంటే.. ఇప్పుడు ఈ రెండూ కలిసిపోయాయి. ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) అధికారికంగా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీ సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు ఇటీవల హాట్‌స్టార్‌తో విలీనం తర్వాత అందుబాటులోకి వచ్చింది.

Read Also : Reliance Jio : జియోలో ఆ చౌకైన ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. మరో ప్లాన్ ధర తగ్గింది.. డేటా, వ్యాలిడిటీ ఎంత? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

రెండింటి విలీనం తర్వాత జియో హాట్‌స్టార్ పేరుతో కంపెనీ తన వెబ్‌సైట్‌ను లైవ్‌లో అందుబాటులోకి తెచ్చింది. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో (ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఐప్యాడ్OS, స్మార్ట్ టీవీ) యాప్‌ను రీబ్రాండ్ చేసింది. అంతేకాదు.. కంపెనీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను కూడా ప్రకటించింది. ఇదివరకే సబ్‌స్ర్కిప్షన్ తీసుకున్న యూజర్లంతా ఏమి చేయాలి? వారి పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఏ యూజర్లు ఫ్రీ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు? :
జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కొంతమంది ప్రత్యేక యూజర్లకు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా ఉచితంగా అందిస్తోంది. అయితే, దీని కోసం కొన్ని షరతులకు లోబడి ఉండాలి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఏం చేయాలి? :
మీరు ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏదైనా ప్లాన్‌కు సబ్‌స్క్రైబర్ అయితే, మీ సబ్‌స్క్రిప్షన్ జియోహాట్‌స్టార్‌కు మైగ్రేట్ అవుతుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ సబ్‌స్క్రిప్షన్ మీ పాత ప్లాన్‌లో మిగిలి ఉన్న రోజులే ఉంటుంది. ఉదాహరణకు.. మీ పాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాన్‌కు 18 రోజుల వ్యాలిడిటీ మిగిలి ఉంటే.. మీరు జియోహాట్‌స్టార్‌లో కూడా అదే 18 రోజులు వ్యాలిడిటీని పొందుతారు.

జియో సినిమా యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఏం చేయాలి? :
మీరు (JioCinema) నెలవారీ లేదా వార్షిక సభ్యత్వాన్ని తీసుకుంటే అది కూడా (JioHotstar)కి మైగ్రేట్ అవుతుంది. మీ ప్రస్తుత వ్యాలిడిటీ ఉన్నంతవరకు ఈ సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది.

రెండు ప్రీమియం ప్లాన్లను ముందే తీసుకుంటే ఏం చేయాలి? :
మీరు మొబైల్ లేదా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ లేదా జియో సినిమా (ప్రీమియం) తీసుకొని ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మీ మొబైల్ లేదా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లేదా జియో సినిమా ప్రీమియంకు సభ్యత్వాన్ని పొందినట్లయితే జియో హాట్‌స్టార్‌లో కూడా చెల్లుబాటు అవుతుంది.

Read Also : JioHotstar : నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా కొత్త ఓటీటీ ‘జియో హాట్‌స్టార్..’ ఇకపై ఒకే యాప్‌లో.. ప్లాన్ల ధరలు ఇవే.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

మీకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లేదో ఎలా చెక్ చేయాలి? :
మీకు ఫ్రీ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ కింది విషయాలను తప్పక తెలుసుకోండి. మీ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీని ఉపయోగించి (JioHotstar) యాప్‌లోకి లాగిన్ అవ్వండి. మీకు ఇప్పటికే ఏదైనా యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ (డిస్నీ+ హాట్‌స్టార్ లేదా జియో సినిమా) ఉంటే.. మీ ప్లాన్ ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుందో యాప్ నోటిఫికేషన్ ద్వారా మీకు నోటిఫై చేస్తుంది.

జియో సినిమా ఆటోపే సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ :
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జియో ఇప్పుడు జియోసినిమా ఆటోపే సబ్‌స్క్రిప్షన్‌ను నిలిపివేస్తోంది. మీరు జియో సినిమాకి సభ్యత్వాన్ని పొంది ఉంటే.. మీరు ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, మీ ప్రస్తుత ప్లాన్ ముగియగానే మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ను వీక్షించేందుకు (JioHotstar) కొత్త సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందని గమనించాలి.