PM Kisan 19th Installment : మరో 3 రోజుల్లో పీఎం కిసాన్ డబ్బులు.. మీ అకౌంట్‌లో రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలంటే?

PM Kisan 19th Installment : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద భారతీయ రైతులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకం కింద 19వ వాయిదా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మీ అకౌంట్లలో రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలో ఇప్పడు తెలుసుందాం.

PM Kisan 19th Installment

PM Kisan 19th Installment : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) భారత్‌లోని చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తోంది. 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా రూ. 6వేలు ఆర్థిక సహాయం లభిస్తుంది. అంటే. రూ. 2వేల చొప్పున 3 సమాన వాయిదాలలో రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపుతుంది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 19వ విడత : ఈ నెల 24నే రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు.. ఈరోజే మీ eKYC చేసుకోండి.. లేదంటే డబ్బులు పడవు!

ఈసారి విడుదల చేయబోయే పీఎం కిసాన్ 19వ విడతపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. రైతులు పీఎం కిసాన్ పోర్టల్‌ను విజిట్ చేయడం ద్వారా వారి పేమెంట్ స్టేటస్, లబ్ధిదారుల జాబితాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. తద్వారా వారి వాయిదాల గురించి సమాచారాన్ని సకాలంలో పొందవచ్చు.

పీఎం కిసాన్ 19వ విడత ఎప్పుడంటే? :
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం 19వ విడత తాత్కాలిక తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, మీడియా నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే ఈ 19వ విడతను విడుదల చేయనుంది.

ఎందుకంటే.. ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒక వాయిదా విడుదల అవుతుంది. మీడియా నివేదికలను విశ్వసిస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 24న బీహార్‌లో జరిగే కార్యక్రమంలో ఈ పీఎం కిసాన్ 19వ విడతను పంపిణీ చేసే అవకాశం ఉంది.

18వ విడత ఎప్పుడు విడుదలైందంటే? :
ప్రధాని మోదీ గత ఏడాదిలో అక్టోబర్ 05న మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి ఈ పథకం 18వ విడతను విడుదల చేశారు. ఇప్పుడు 18వ విడత వచ్చింది కాబట్టి, తదుపరి 19వ విడత తమ బ్యాంకు ఖాతాల్లోకి ఎప్పుడు వస్తుందా అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రంలోని 81 లక్షలకు పైగా రైతులకు రూ .1682.9 కోట్లకు పైగా బదిలీ అయింది. ఈ విడత అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయింది.

లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేయాలంటే? :
లబ్ధిదారుడి స్టేటస్ కోసం ఈ డైరెక్ట్ లింక్ ద్వారా (https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx) లబ్ధిదారుల స్టేటస్ చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా పూర్తి సమాచారం :

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ (https://pmkisan.gov.in/)కి వెళ్లండి.
  • “Farmer’s Corner” పై క్లిక్ చేయండి.
  • “Beneficiary Status” లేదా “Beneficiary List” పై క్లిక్ చేయండి.
  • మీ వివరాలను ఎంటర్ చేసి, వాయిదా స్టేటస్ చెక్ చేయండి.
  • లబ్ధిదారుల జాబితా ఆప్షన్ ఎంచుకోండి.
  • ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది. రాష్ట్రం పేరు, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
  • వివరాలన్ని నింపిన తర్వాత ‘Get Report’పై క్లిక్ చేయండి.
  • మీ గ్రామానికి చెందిన ప్రధాన మంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
  • ఈ జాబితాలో మీ పేరు ఉంటే, డబ్బు కూడా మీ అకౌంట్లోకి వస్తుంది.

మీ పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే ఏమి చేయాలి :
ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద మీ వాయిదాలు అనేక కారణాల వల్ల నిలిచిపోయే అవకాశం ఉంది. ఇంతకీ వాయిదాలు ఎందుకు నిలిచిపోతాయో కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకోండి.

Read Also : iPhone 16e Launch : భలే ఉంది భయ్యా.. అత్యంత సరసమైన ఆపిల్ ఐఫోన్ 16e వచ్చేసిందోచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

ఆధార్ వెరిఫికేషన్ లోపం : మీ ఆధార్ నంబర్ పథకంతో సరిగ్గా లింక్ చేయకపోతే లేదా మీ ఆధార్ వివరాలలో ఏదైనా లోపం ఉంటే వాయిదా నిలిచిపోవచ్చు.
eKYC పూర్తి చేయకపోతే : పీఎం కిసాన్ యోజన కింద eKYC తప్పనిసరి. మీరు సకాలంలో eKYC చేయకపోతే, వాయిదా విడుదల కాదు.
భూమి రికార్డులలో సమస్యలు : పథకం లబ్ధిదారులు అర్హత పొందాలంటే భూమి రికార్డులు సరిగ్గా ఉండాలి. మీ భూమి రికార్డులలో ఏదైనా వ్యత్యాసం ఉంటే లేదా వివరాలు సరిపోలకపోతే, వాయిదాను నిలిపివేయవచ్చు.

వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి : 

  • పీఎం కిసాన్ పోర్టల్‌కి వెళ్లండి.
  • “Farmer Corner” సెక్షన్‌కు వెళ్లి “Beneficiary Status”పై క్లిక్ చేయండి.
  • మీ వివరాలను ఎంటర్ చేసి, వాయిదా స్టేటస్ చెక్ చేయండి.