PM Kisan Yojana
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 20వ విడత విడుదల ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
నివేదికల ప్రకారం.. జూన్ చివరి వరకు లేదా జూలై ప్రారంభంలో 20వ విడత డబ్బులు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, రైతులు తమ వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
Read Also : Redmi Note 14 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. చౌకైన ధరకే కొత్త రెడ్‌మి ఫోన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
రూ. 2వేలు పడే లోగా రైతులు తమ ఆధార్‌తో పేరు సరిపోలకపోవడం, బ్యాంకు అకౌంట్ యాక్టివ్ లేకపోవడం వంటి తప్పు వివరాలను వెంటనే సరిచేసుకోవాలి. ఈ లోపాలను ఎంత తొందరగా సరిచేసుకుంటే అంత మంచిది. ఇంతకీ ఏయే తప్పులను ఎలా సరిచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం..
ఈ చిన్నపాటి తప్పులను సరిచేసుకోండి :
ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి :
పీఎం కిసాన్ చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి 6వేలు 3 విడతలుగా అందిస్తుంది. ఈ పథకం ఆధార్ ధృవీకరణ కలిగిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది. పేరు లేదా ఇతర వివరాలలో చిన్న తప్పు కూడా ఉండకూడదు. లేదంటే రూ. 2వేలు బ్యాంకు ఖాతాలో పడవు.
ఆధార్‌తో పేరు మిస్ మ్యాచ్.. ఎలా ఫిక్స్ చేయాలి? :
ఆఫ్‌లైన్ నేమ్ కరెక్షన్ కోసం ఆధార్, ల్యాండ్ రికార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పీఎం కిసాన్ ఐడీతో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించండి.
20వ విడతకు ముందు ఈ విషయాలను చెక్ చేయండి :
e-KYC ఎందుకు తప్పనిసరి? :
పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. eKYC తప్పనిసరిగా ఉండాలి. eKYC లేకుండా ఏ రైతు రూ. 2వేలు పొందలేరు. eKYCని రెండు విధాలుగా పూర్తి చేయవచ్చు. OTP ఆధారిత eKYC (మొబైల్ నంబర్ లింక్) చేయొచ్చు. CSC కేంద్రాన్ని విజిట్ చేసి బయోమెట్రిక్స్ ద్వారా eKYC ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :