Vivo X Fold 5 : వివో కొత్త ఫోన్ చూశారా? మడతబెట్టే ఫోన్ అంట.. ట్రిపుల్ కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంతైనా కొని తీరాల్సిందే..!
Vivo X Fold 5 : వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. భారీ బ్యాటరీతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.. ధర ఎంతంటే?

Vivo X Fold 5
Vivo X Fold 5 : వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్ చూశారా? అద్భుతమైన ఫీచర్లతో బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. 6.53-అంగుళాల కవర్ డిస్‌ప్లే, 8.03-అంగుళాల ఇన్నర్ ఫ్లెక్సిబుల్ (Vivo X Fold 5) ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ రెండు డిస్‌ప్లేలు 4,500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో 8T LTPO ప్యానెల్ కలిగి ఉన్నాయి.
ఈ హ్యాండ్‌సెట్ వివో X ఫోల్డ్ 3 ప్రో కన్నా తేలికగా సన్నగా ఉంటుంది. లేటెస్ట్ వివో ఫోల్డబుల్‌లో జైస్-బ్యాక్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, రెండు 20MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. వివో ఎక్స్ ఫోల్డ్ 5 ఫోన్ వాటర్, డస్ట్ నిరోధకతకు IPX8+IPX9+IPX9+, IP5X రేటింగ్ కలిగి ఉంది.
వివో X ఫోల్డ్ 5 ధర ఎంతంటే? :
వివో X ఫోల్డ్ 5 ఫోన్ 12GB + 256GB వేరియంట్ ధర CNY 6,999 (సుమారు రూ. 83,800), 12GB + 512GB వేరియంట్ CNY 7,999 (సుమారు రూ. 96వేలు)గా కంపెనీ నిర్ణయించింది. హై-ఎండ్ 16GB + 512GB, 16GB + 1TB వేరియంట్‌లు వరుసగా CNY 8,499 (సుమారు రూ. 1,02,000), CNY 9,499 (సుమారు రూ. 1,14,000)గా ఉన్నాయి. ఈ ఫోన్ బైబాయి (గ్రీన్), క్వింగ్‌సాంగ్ (వైట్), టైటానియం (బ్లాక్) కలర్ ఆప్షన్లలో వస్తుంది. జూలై 2 నుంచి అధికారిక ఇ-స్టోర్, ఎంపిక చేసిన ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.
వివో X ఫోల్డ్ 5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo X Fold 5) :
వివో X ఫోల్డ్ 5లో 8.03-అంగుళాల 8T LTPO మెయిన్ ఫ్లెక్సిబుల్ ఇన్నర్ డిస్‌ప్లే, 6.53-అంగుళాల 8T LTPO ఔటర్ స్క్రీన్ ఉన్నాయి. ఈ ప్యానెల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్, హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ రేట్, TUV రీన్‌ల్యాండ్ గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 3.0, జీస్ మాస్టర్ కలర్ సర్టిఫికేషన్‌లను సపోర్ట్ చేస్తాయి.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మునుపటి వివో X ఫోల్డ్ 3 ప్రోకి కూడా పవర్ అందిస్తుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. ఫోల్డబుల్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత OriginOS 5తో వస్తుంది.
Read Also : Redmi Note 14 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. చౌకైన ధరకే కొత్త రెడ్‌మి ఫోన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
ఆప్టిక్స్ విషయానికొస్తే.. :
వివో X ఫోల్డ్ 5లో జీసెస్ T లెన్స్ కోటింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఈ సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్ ఉంది. 50MP అల్ట్రా-వైడ్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ సిస్టమ్ టెలిఫోటో మాక్రో ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది. ఫోల్డ్ లోపల బయటి స్క్రీన్‌లలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాలు ఉన్నాయి.
వివో X ఫోల్డ్ మోడల్ ఆపిల్ ఐఫోన్, ఎయిర్‌పాడ్‌లు, మ్యాక్‌బుక్, ఆపిల్ వాచ్, ఐక్లౌడ్‌తో సహా ఎకో సిస్టమ్ ఉందని వివో ధృవీకరిస్తుంది. వినియోగదారులు తమ డేటాను నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌లు, సర్వీసులకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయవచ్చు. వివో X ఫోల్డ్ 5లో 6,000mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
మన్నిక పరంగా ఈ హ్యాండ్‌సెట్ IP5X రేటింగ్, నీటి నిరోధకతకు IPX8+IPX9+IPX9 ప్లస్ రేటింగ్‌లను కలిగి ఉంది. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద పనిచేస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫోల్డబుల్ బరువు 217 గ్రాములు, ఫోల్డ్ చేసినప్పుడు 9.2mm మందం, ఫోల్డ్ ఓపెన్ చేస్తే 4.3mm ఉంటుంది.