Redmi Note 14 : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. చౌకైన ధరకే కొత్త రెడ్‌మి ఫోన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Redmi Note 14 : రెడ్‌మి నోట్ 14 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

Redmi Note 14
Redmi Note 14 : అతి తక్కువ ధరలో రెడ్‌మి ఫోన్ కావాలా? ప్రస్తుతం అమెజాన్‌లో రెడ్‌మి నోట్ 14 స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ ఫోన్ (Redmi Note 14) ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా (OISతో) 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. హుడ్ కింద, మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర ఆఫర్ల వివరాలను ఓసారి లుక్కేయండి..
రెడ్‌మి నోట్ 14 డిస్కౌంట్ :
బేస్ వేరియంట్ ధర రూ.18,999 ఉండగా ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.16,999కే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో రెడ్‌మి ధర రూ.15,999కి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లేవు.
Read Also : Vivo V40 Pro 5G : అమెజాన్ ఆఫర్ అదుర్స్.. వివో V40 ప్రో 5G ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే?
రెడ్‌మి నోట్ 14 స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 14 ఫోన్ 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ లెన్స్‌తో పాటు సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాతో డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది.
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,110mAh బ్యాటరీ కలిగి ఉంది. రెడ్‌మి ఇటీవలే భారత మార్కెట్లో న బడ్జెట్-ఫ్రెండ్లీ టాబ్లెట్, ప్యాడ్ 2 లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీని కలిగి ఉంది. రూ. 14వేల కన్నా తక్కువ ధరకు ప్యాడ్ 2లో గూగుల్ జెమిని ఏఐ సర్కిల్-టు-సెర్చ్ ఫంక్షనాలిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.