PM Kisan 20th Installment
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? మరో రెండు నెలల్లో పీఎం కిసాన్ డబ్బులు పడనున్నాయి. 19వ విడత డబ్బులు అందుకున్న రైతులంతా ఇప్పుడు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత వచ్చే జూన్ 2025లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకం 20వ విడతలో భాగంగా రూ. 2వేలు అర్హత గల రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. దాదాపు 10 కోట్ల మంది రైతులు ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాన్ని పొందనున్నారు.
పీఎం కిసాన్ పథకంలో మీ పేరుతో రిజిస్టర్ చేసుకోండి. అయితే, రైతుల అకౌంటులో రూ. 2వేలు పడాలంటే ముందుగా కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు పథకానికి సంబంధించిన అవసరమైన అన్ని వివరాలను పూర్తి చేయకపోతే.. వాయిదాల డబ్బు నిలిచిపోతుంది. ఫలితంగా మీ అకౌంట్లలో డబ్బులు పడవు. రైతులు ముందుగా ఈ కింది పనులను తప్పక పూర్తి చేయాలి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
పీఎం కిసాన్ e-KYC ఎలా పూర్తి చేయాలంటే? :
సమ్మాన్ నిధి యోజన 20వ విడత ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. ముందుగా, కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిసారి రైతులు ముందుగా భూమి ధృవీకరణ పొందాలి. అంతేకాదు.. రైతులు తమ e-KYC కూడా పూర్తి చేయాలి. రైతులు వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Read Also : Amazon Sale : ట్రిపుల్ కెమెరా ఫోన్ కావాలా? మోటో ఎడ్జ్ 50ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇంకా ధర తగ్గాలంటే..!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి రూ.6వేలు చొప్పున 3 వాయిదాలలో పొందవచ్చు. ఒక్కొక్కటి 3 నెలలకు రైతులు వాయిదాల్లో పొందవచ్చు. ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతుల సంఖ్య 12 కోట్లకు దాటింది. అయితే, అన్ని అర్హతలు కలిగిన రైతులు మాత్రమే పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందవచ్చు.