×
Ad

PM Kisan 21st installment : రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 21వ విడత రూ. 2వేలు పడేది ఎప్పుడంటే? మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి!

PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ విడత రూ.2వేలు త్వరలో విడుదల కానుంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ చివరి వారంలో విడుదల అవ్వొచ్చు.

PM Kisan Scheme

PM Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశంలో రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) యోజన కింద 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే రూ. 2000 అందుకున్నప్పటికీ, చాలా మంది రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో పంటలకు తీవ్ర నష్టం కారణంగా అక్కడి రైతులకు మాత్రమే కేంద్రం రూ. 2వేలు విడుదల చేసింది. ఈ ప్రాంతాల్లోని సుమారు 27 లక్షల మంది రైతులకు వాయిదా అందుకున్నారు.

మీరు అర్హులా కాదా? :
కొన్ని సాంకేతిక లోపాల కారణంగా లక్షలాది మంది రైతుల డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంది. రూ. 2వేలు వాయిదా పడాలంటే కొన్ని పనులను తప్పక పూర్తి చేసి ఉండాలి. లేదంటే రావాల్సిన డబ్బులు కోల్పోతారు. అర్హత కలిగి ఉండి సరైన డాక్యుమెంట్లు కలిగిన రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందగలరు. రైతులు వెంటనే తమ ఇ-కేవైసీ, బ్యాంక్ అకౌంట్ వివరాలను చెక్ చేసి ఏమైనా తప్పులుంటే వెంటనే అప్ డేట్ చేసుకోండి.

3 రాష్ట్రాలకు ముందస్తు వాయిదా ఎందుకంటే? :
పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి వరద బాధిత రాష్ట్రాలలోని దాదాపు 27 లక్షల మంది రైతులకు వారి అత్యవసర అవసరాలకు షెడ్యూల్ కన్నా ముందుగానే రూ. 2,000 వాయిదా డబ్బులు పడ్డాయి. అవసరమైన అన్ని నిబంధనలను పాటించిన రైతులు తప్పనిసరిగా తమ స్టేటస్ చెక్ చేయాలి.

ఈ మూడు రాష్ట్రాలు ఇటీవల భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాయి. దీని కారణంగా ఇక్కడి రైతులు తమ పంటలు, వ్యవసాయంలో భారీ నష్టాలను చవిచూశారు. ఈ క్లిష్ట పరిస్థితిలో దుర్గా పూజ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఆర్థిక సాయం అందించడం ద్వారా రైతులకు భారీ ఉపశమనం కలిగించింది.

పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు వస్తుంది? :

కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని వెల్లడించలేదు. 21వ విడత దీపావళికి ముందే విడుదల కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. 2025 అక్టోబర్ చివరి వారంలో 21వ విడత డబ్బులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అవసరమైన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన రైతులకు త్వరలో పేమెంట్ అందుతుంది. కానీ, అలా చేయని రైతులకు మరింత ఆలస్యం కావచ్చు.

ఇ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి? :
రైతులు తమ ఆధార్ నంబర్, OTP ద్వారా అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ (pmkisan.gov.in)లో ఆన్‌లైన్‌లో e-KYCని పూర్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం సమీపంలోని CSC కేంద్రాలు లేదా బ్యాంకులను సందర్శించవచ్చు. పేమెంట్ వస్తుందో లేదో తెలుసుకునేందుకు రైతులు తమ లబ్ధిదారుల స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో తమ పేరు కనిపిస్తే వారు రూ.2వేలు వాయిదాకు అర్హులు.

మీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
మీ అకౌంటులో 21వ విడత జమ అవుతుందో లేదో తెలుసుకోవడం చాలా ఈజీ. ముందుగా (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. “Know Your Status” ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు, మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

ఏ రైతులకు 21వ విడత డబ్బులు రావు? :
ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే కొన్ని పనులను తప్పక పూర్తి చేయాలి. ఈ కింది లోపాలు ఉంటే రైతులకు రావాల్సిన రూ.2వేలు ఆగిపోయే అవకాశం ఉంటుంది.

  • e-KYC పూర్తి చేయని రైతులు.
  • ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంటుకు లింక్ చేయని రైతులు.
  • బ్యాంక్ అకౌంట్ IFSC కోడ్ తప్పుగా ఇవ్వడం
  • బ్యాంకు అకౌంట్ క్లోజ్ అవ్వడం
  • మీ వ్యక్తిగత వివరాలు తప్పుగా ఉండటం

మీ అకౌంటులో డబ్బు పడిందో లేదో ఎలా చెక్ చేయాలి? :
పీఎం కిసాన్ వాయిదా వచ్చిందో లేదో చెక్ చేసేందుకు ముందుగా మీ ఫోన్‌లో మెసేజ్ చెక్ చేయండి. వాయిదా క్రెడిట్ అయ్యాక ప్రభుత్వం, బ్యాంకు రెండింటి నుంచి రైతుకు మెసేజ్ పంపుతుంది. ఒకవేళ మీకు మెసేజ్ అందకపోతే, మీ సమీపంలోని ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయండి లేదా బ్యాంకు బ్రాంచుకు వెళ్లి పాస్‌బుక్‌లో బ్యాలెన్స్ చెక్ చేయించుకోండి.