PM Kisan 21st Installment Date
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. మీరు పీఎ కిసాన్ డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు రైతు అయితే, ప్రభుత్వం నిర్వహించే పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు. రైతులు పంట పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందుకే ఇలాంటి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తోంది. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం.. రైతుల కోసం ప్రత్యేకంగా ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి 3 సార్లు (PM Kisan) రూ. 2,000 అందుకుంటారు. ఇప్పటివరకు లబ్ధిదారు రైతులందరూ 20 వాయిదాలు అందుకున్నారు. ఈ ఏడాదిలో 21వ విడత విడుదల చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కొందరి రైతులు 21వ విడత రూ. 2వేలు డబ్బులు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, మరికొందరి రైతుల వాయిదాలు ఆలస్యం కావచ్చు? ఏ రైతుల వాయిదాలను అందుకుంటారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ రైతులకు 21వ విడత రాదంటే?:
మీరు పీఎం కిసాన్ లబ్ధిదారు అయినప్పటికీ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే మీకు రావాల్సిన రూ. 2వేలు అకౌంటులో పడవు. నిర్ణీత సమయంలోపు అవసరమైన అన్ని పనులను పూర్తి చేయాలి. లేదంటే మీరు వాయిదా ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. మీరు వాయిదాల నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే మీ ఇ-కేవైసీని పూర్తి చేయాలి. మీరు పీఎం కిసాన్ యోజన కింద వాయిదాలను పొందాలనుకుంటే నిర్ణీత గడువులోపు మీ ల్యాండ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి.
ఎందుకంటే అలా చేయకపోతే మీ వాయిదా మొత్తం ఆలస్యం కావచ్చు. ఇ-కేవైసీ మాదిరిగానే ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చాలా ముఖ్యమని గమనించాలి. మీరు పీఎం కిసాన్ యోజన కింద వాయిదా బెనిఫిట్స్ పొందాలనుకుంటే మీరు మరో ముఖ్యమైన పని పూర్తి చేయాలి. ఆధార్ లింక్ చేయాలి. మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ అకౌంటుకు లింక్ చేయాలి. అయితే, అలా చేయని రైతులకు వాయిదా డబ్బులు ఆలస్యమవుతాయి.
పీఎం కిసాన్ పథకం లబ్ధిదారు రైతులకు ఈ నెలలోనే 21వ విడత విడుదల కావాల్సి ఉంది. అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ 21వ విడత త్వరలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. నవంబర్ నాటికి వాయిదా విడుదల అయ్యే అవకాశం ఉంది. లక్షలాది మంది రైతులు ఈ విడత ద్వారా భారీగా ప్రయోజనం పొందనున్నారు.