PM Kisan 21st Instalment
PM Kisan 21st Instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ న్యూస్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు నిజంగా పండగలాంటి వార్త.. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత కోసం రైతుల నిరీక్షణ దాదాపు ముగిసినట్టే.. మీడియా నివేదికల ప్రకారం.. దీపావళికి ముందు రైతుల ఖాతాల్లో రూ. 2వేలు జమ అయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యోజన 21వ విడత అసలు ఎప్పుడు విడుదల అవుతుంది? ఏయే రైతులు నేరుగా వారి ఖాతాల్లో రూ. 2వేలు అందుకుంటారు. పీఎం కిసాన్ 21వ విడత అందాలంటే రైతులు ఏయే పనులు పూర్తి చేసి ఉండాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ రైతులకు ముందుగానే రూ. 2వేలు విడుదల :
ఈసారి కేంద్ర ప్రభుత్వం పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సుమారు 2.7 మిలియన్ల మంది రైతుల ఖాతాలకు రూ. 2వేలు విడుదల చేసింది. ఈ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదలు రైతులకు భారీగా నష్టాన్ని కలిగించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాల రైతులకు ముందస్తుగా పీఎం కిసాన్ వాయిదా డబ్బులను విడుదల చేసింది. ఇప్పుడు, ఇతర రాష్ట్రాలలోని రైతులు కూడా పీఎం కిసాన్ యోజన 21వ విడత పండుగ సీజన్‌కు ముందే తమ ఖాతాల్లోకి వస్తుందని ఆశిస్తున్నారు.
21వ విడత ఎప్పుడు విడుదలంటే? :
గత కొన్ని ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే.. 2023 విడత నవంబర్ 15న విడుదల చేయగా, 18వ విడత 2024 అక్టోబర్ 5న విడుదల అయింది. ఈసారి, 21వ విడత 2025, అక్టోబర్ 20 నాటికి రైతుల ఖాతాల్లో జమ అవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడొచ్చునని అనేక నివేదికలు పేర్కొన్నాయి.
ఈ రైతులకు రూ. 2వేలు పడవు. :
మీరు పీఎం కిసాన్ యోజన కింద ఇ-కేవైసీ (పీఎం కిసాన్ ఇ-కేవైసీ అప్‌డేట్) పూర్తి చేయకపోతే మీకు అందాల్సిన రూ. 2వేలు ఆలస్యం కావచ్చు. ఇ-కేవైసీ లేకుండా ఎలాంటి పేమెంట్ జరగదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇదికాకుండా, బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ చేయకపోతే.. IFSC కోడ్ లేదా అకౌంట్ నంబర్ తప్పుగా ఉంటే లేదా అకౌంట్ క్లోజ్ అయితే డబ్బు ట్రాన్స్‌ఫర్ కాదు.
చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పుడు సమాచారం లేదా డాక్యుమెంట్లను సమర్పించి వారి వాయిదాలు మాత్రమే ఆలస్యమవుతున్నాయి. మీ బ్యాంక్ వివరాలు, ఆధార్ లింకింగ్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం బెటర్.
చాలామంది రైతులు తమ పేరు ఇప్పటికీ పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో అని సందేహం ఉంటుంది. మీ పేరు ఉందో లేదో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు.
ఈ జాబితాలో మీ పేరు కనిపిస్తే.. మీ వాయిదా త్వరలో వస్తుంది. మీ e-KYC, ఆధార్, బ్యాంక్ వివరాలను త్వరగా అప్‌డేట్ చేయండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) 21వ విడత అధికారిక తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. దీపావళికి ముందు వాయిదా అందే అవకాశం ఉంది. అందువల్ల, రైతులు తమ ఇ-కేవైసీ, ఆధార్, బ్యాంక్ వివరాలను ఇప్పుడే చెక్ చేసుకోవాలి. వాయిదా విడుదల అయిన వెంటనే మీ డబ్బు నేరుగా బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుంది.
పీఎం కిసాన్ యోజన ఏంటి? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ డబ్బును ఒకేసారి బదిలీ చేయరు. కానీ, రూ. 2వేలు చొప్పున 3 సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 20 వాయిదాలు విడుదల అయ్యాయి.