×
Ad

PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ 22వ విడతపై బిగ్ న్యూస్.. అర్జెంట్‌గా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే ఈ రైతులకు రూ. 2వేలు పడవు!

PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ 22వ వాయిదా ఎప్పుడు రానుంది? లబ్ధిదారు రైతులు రాబోయే వాయిదాను ఎలా పొందాలి? కొన్ని ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేయండి.

PM Kisan 22nd Installment

PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 22వ వాయిదా రాబోతుంది. ఇప్పటికే 21వ వాయిదా అందుకున్న రైతులు రాబోయే విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద దేశంలోని చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ సంబంధిత ఖర్చులకు ప్రత్యక్ష ఆర్థిక సాయాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ. 6వేలు చొప్పున 3 విడతలుగా ఒక్కొక్కరికి రూ. 2వేలు చొప్పున అందిస్తోంది.

ఇందులో అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్లలో (PM Kisan 22nd Installment) నేరుగా డబ్బులు పడతాయి. ఈ పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటివరకూ ఈ పథకం ద్వారా 21 వాయిదాలు విడుదల అయ్యాయి. రైతులు ప్రతి విడతలో రూ. 2వేలు అందుకుంటారు. ఈ డబ్బు DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా నేరుగా లబ్ధిదారుల రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది.

ఏ రైతులు అర్హులంటే? :
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న రైతులకు మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనం చేకూరుస్తుంది. వీటిలో సాగు భూమి ఉండటం, భూమి రికార్డులలో వారి పేరు నమోదు కావడం, ప్రభుత్వ ఉద్యోగం లేకపోవడం, ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా లేకపోవడం వంటివి ఉన్నాయి. ఈ అర్హతలు కలిగి ఉంటేనే పీఎం కిసాన్ పథకం వాయిదాలను పొందడానికి అర్హులు.

తప్పుడు డాక్యుమెంట్లతో వాయిదా పొందలేరు :
కొంతమంది తప్పుడు సమాచారం, ఫేక్ డాక్యుమెంట్లతో ఈ పథకాన్ని పొందాలని చూస్తుంటారు. అయితే, ఈ దరఖాస్తులను శాఖ కాలానుగుణంగా చెక్ చేస్తుంది. ఎవరైనా రైతు డాక్యుమెంట్లు ఫేక్ అని తేలితే లేదా వారు తప్పుడు సమాచారంతో అప్లయ్ చేశారని గుర్తిస్తే వారి అప్లికేషన్ వెంటనే రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత రైతుకు ఎలాంటి వాయిదాలు అందవు. పీఎం కిసాన్ వాయిదా బెనిఫిట్స్ నిజంగా అర్హత ఉన్న రైతులకు మాత్రమే చేరేలా ప్రభుత్వం ఇలాంటి కఠిన చర్యలను చేపట్టింది.

Read Also : Best Camera Phones : శాంసంగ్ S25 అల్ట్రాకు గట్టి పోటీనిచ్చే 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి..!

ల్యాండ్ వెరిఫికేషన్ ఎందుకంటే? :

ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంలో భూమి ధృవీకరణ అత్యంత ముఖ్యం. ఇందులో రైతుల సాగు భూమిని ధృవీకరించడంతో పాటు రికార్డులను అప్‌డేట్ చేయించుకోవాలి. చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జిల్లా లేదా తహసీల్ స్థాయిలో నిర్వహిస్తారు. రైతులు ఈ పనిని సకాలంలో పూర్తి చేయకుంటే వారి పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించవచ్చు. దీనివల్ల వారి వాయిదా డబ్బులు మరింత ఆలస్యం కావచ్చు.

e-KYC తప్పనిసరి :
ఈ పథకంలో ముఖ్యమైన వాటిలో ఇ-కేవైసీ ప్రక్రియ ఒకటి. ఈ ప్రక్రియ రైతు ఐడెంటిటీని ధృవీకరిస్తుంది. డబ్బు సరైన వ్యక్తికి చేరుతుందని నిర్ధారిస్తారు. రైతులు సమీపంలోని CSC కేంద్రాన్ని విజిట్ చేయడం ద్వారా అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా e-KYCని పూర్తి చేయవచ్చు. లేదంటే మొబైల్ యాప్ ద్వారా కూడా చేయొచ్చు. ఎవరైనా రైతు e-KYCని పూర్తి చేయకపోతే వారికి రాబోయే పీఎం కిసాన్ వాయిదా ఆగిపోతుంది. అందుకే రైతులంతా ఇ-కేవైసీని సకాలంలో పూర్తి చేయడం తప్పనిసరి.

22వ విడత ఎప్పుడు వస్తుందంటే? :
కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ వాయిదాలను విడుదల చేస్తుంది. 21వ విడత ఇప్పటికే పంపిణీ చేయగా ఇక 22వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అవుతుందని భావిస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. రైతులు త్వరలో పీఎం కిసాన్ పోర్టల్‌లో వాయిదాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

రైతులు తప్పక చేయాల్సిన పనులివే :
రైతులు భవిష్యత్తులో పీఎం కిసాన్ వాయిదాల ఆలస్యం లేదా అంతరాయం లేకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన రూల్స్ గుర్తుంచుకోవాలి. సకాలంలో e-KYC పూర్తి చేయండి. మీ భూమి ధృవీకరణ పూర్తి చేయండి. డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయండి. ఆధార్, బ్యాంక్ అకౌంట్లను లింక్ చేయండి. మెసేజ్‌లను పొందడానికి మీ మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచండి. ఈ సాధారణ నిబంధనలు పాటించడం ద్వారా రైతులు ప్రతి వాయిదాను ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందవచ్చు.