PM Kisan 22nd instalment (Image Credit To Original Source)
PM Kisan 22nd instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. 2026 కొత్త ఏడాదిలో దేశంలోని కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులు ప్రతి ఏడాదిలో రూ. 6వేలు అందుకుంటారు.
ఒక్కొక్కరికి రూ. 2వేలు చొప్పున మూడు విడతలుగా రైతులు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. ఇప్పటివరకూ 21 వాయిదాలు విడుదల కాగా 22వ వాయిదా విడుదల తేదీకి సంబంధించి పీఎం కిసాన్ రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.
పీఎం కిసాన్ 22వ విడత విడుదల ఎప్పుడంటే? :
మీడియా నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ 22వ విడత 2026 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి అందే అవకాశం ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. పీఎం నరేంద్ర మోదీ గత ఏడాదిలో నవంబర్ 19న తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 21వ విడతను విడుదల చేశారు. ఆ రోజున దాదాపు 9 కోట్ల మంది రైతులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా రూ.18,000 కోట్లకు పైగా అందుకున్నారు.
Read Also : Telangana Govt : రైతులకు శుభవార్త.. తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక.. 50 శాతం రాయితీ
ఈసారి రైతు ఐడీకార్డు ఉంటేనే :
పీఎం కిసాన్ 22వ విడతకు ముందు ప్రతి అర్హత గల రైతులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి. గతంలో ఈ-కెవైసీ ఒక్కటి పూర్తి చేస్తే సరిపోయేది. కానీ, ఇప్పుడు అలా కాదు.. ఫార్మర్ ఐడీ లేని రైతులు వారి ఈ-కెవైసి పూర్తయినప్పటికీ 22వ విడత పొందలేరని కేంద్రం స్పష్టం చేసింది.
PM Kisan 22nd instalment (Image Credit To Original Source)
రైతు ఐడీ అనేది రైతులకు డిజిటల్ ఐడెంటిటీ. భూమి రికార్డులు, పంట వివరాలు, ఇతర వ్యవసాయ సంబంధిత సమాచారం లింక్ అయి ఉంటుంది. అర్హత కలిగిన రైతులు మాత్రమే ఈ పథకం నుంచి ప్రయోజనం పొందేలా ప్రభుత్వం ఈ కొత్త మార్పు అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికీ ఎవరైనా రైతు ఐడీని జనరేట్ చేసుకోకపోతే రూ. 2వేలు నిలిచిపోతాయి.
పీఎం కిసాన్ e-KYC తప్పనిసరి :
పీఎం కిసాన్ వాయిదా నిలిచిపోవడానికి కారణాలివే :
కొన్నిసార్లు, e-KYC పూర్తయినప్పటికీ వాయిదాలు బ్లాక్ అవుతాయి. అందుకు ఈ కింది కారణాలు కావొచ్చు.
భూమికి సంబంధించిన సమస్యలున్నా కూడా వాయిదా నిలిచిపోవచ్చు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్, పాత భూమి రికార్డులు లేదా భూ వివాదాలు రైతును అనర్హులుగా చూపించవచ్చు. ఇలాంటి సందర్భాలలో పూర్తి వివరాలను వీలైనంత త్వరగా అప్ డేట్ చేయాలి.
22వ వాయిదా రాకపోతే రైతులు ఏం చేయాలి? :
పీఎం కిసాన్ రూ. 2వేలు జమ కాకపోయినా లేదా స్టేటస్ చూపించకపోతే రైతులు CSC సెంటర్ సందర్శించవచ్చు. లేదంటే సంబంధిత బ్యాంకును సంప్రదించవచ్చు లేదా స్థానిక వ్యవసాయ శాఖను సంప్రదించవచ్చు. హెల్ప్ కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్‌లను కూడా ఏర్పాటు చేసింది. 1800-115-526 లేదా 011-23381092కు డయల్ చేయండి. మీరు ఈమెయిల్: pmkisan-ict@gov.inకు కూడా మెయిల్ చేయొచ్చు.