PM Kisan Yojana 19th installment update
PM Kisan Yojana 19th installment : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్ సమ్మాన్ నిధి) 19వ విడత త్వరలో రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బీహార్‌కు చెందిన 13 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు రూ. 2వేలు పంపనున్నారు.
అయితే, ఇంకా eKYC పూర్తి చేయని రైతులు ఈ పథకం 19వ విడత (PM కిసాన్ పథకం 19వ విడత) పొందలేరు. రైతు సోదరులు, సోదరీమణులు తమ eKYCని వెంటనే పూర్తి చేసుకోవాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారిక ఎక్స్ వేదికగా ఒక అడ్వైజరిని జారీ చేసింది.
ఫిబ్రవరి 24న మీ అకౌంట్లోకి రూ.2వేలు :
దేశంలోని చిన్న రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. భారత ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో మూడు విడతలుగా జమ చేస్తారు. ప్రతి విడతలో రూ. 2 వేల రూపాయలు బదిలీ అవుతాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 24న బీహార్‌లోని భాగల్పూర్ నుంచి రైతుల బ్యాంకు అకౌంట్లకు నేరుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడతను బదిలీ చేస్తారని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పోస్ట్‌లో తెలిపింది. దాంతో పాటు, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కిసాన్ భాయ్-సిస్టర్లందరూ ఈరోజే తమ eKYCని పూర్తి చేయాలని సూచించారు.
రైతులకు 19వ విడతపై కేంద్రం అలర్ట్ :
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Scheme) ప్రయోజనాలను పొందడానికి కొన్ని అర్హత షరతులు ఉన్నాయి. ఈ-కెవైసి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం రైతులందరికీ పదే పదే సలహాలు జారీ చేస్తోంది.
e-KYC పూర్తి చేసిన రైతులకు మాత్రమే తదుపరి విడత డబ్బులు పడతాయి. దాంతో పాటు, ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి రైతులు భూమి ధృవీకరణ చేయించుకోవడం తప్పనిసరి. ఈ-కెవైసి చేయించుకోని లేదా భూమి ధృవీకరణ చేయించుకోని రైతులు ఈ వాయిదా చెల్లింపును పొందలేరు.
పీఎం కిసాన్‌లో eKYC ఎందుకు అవసరం? :
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లబ్ధిదారులకు ఆర్థిక సాయం నేరుగా వారి ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లోకి చేరేలా చూసుకోవడానికి ప్రభుత్వం eKYCని తప్పనిసరి చేసింది. ఈ విధంగా, ఫేక్ క్లెయిమ్‌లను నిరోధించవచ్చు. అవసరమైన రైతులు మాత్రమే ప్రయోజనం పొందుతారు.
రైతులు ఈ-కేవైసీని ఇలా చేయాలి :
ఆన్‌లైన్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? :
హెల్ప్‌లైన్ :
మీకు పీఎం కిసాన్ యోజన గురించి ఏదైనా తెలుసుకోవాలంటే.. మీరు హెల్ప్‌లైన్ నంబర్ 155261కు కాల్ చేయవచ్చు. ఇది కాకుండా, మరో నంబర్‌కు సంప్రదించవచ్చు. ఈ నంబర్ 1800115526, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు కొత్తగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో కనెక్ట్ అయి ఉన్నా లేదా ఇప్పటికే లబ్ధిదారుడిగా ఉన్నా మీకు ఏదైనా సహాయం కావాలన్నా మీరు 011-23381092 నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు.
ఈమెయిల్ ఐడీ :
మీరు ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులైతే, ఈ పథకానికి సంబంధించి ఏదైనా హెల్ప్ పొందాలంటే మీరు హెల్ప్‌లైన్ కాకుండా వేరే ఎవరినైనా సంప్రదించవచ్చు. ఈ పథకానికి (pmkisan-ict@gov.in) అనే అధికారిక ఇమెయిల్ ఐడీ ఉంది. మీరు ఈజీగా ఇమెయిల్ చేయవచ్చు.