PM Kisan Yojana
PM Kisan Yojana 20th Installment : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి బహిరంగ సభలో ప్రధాన నరేంద్ర మోదీ కిసాన్ 20వ విడత రూ.2వేలు (PM Kisan Yojana) విడుదల చేశారు. మొత్తం రూ. 20వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు డబ్బులు జమ అవుతాయి.
పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది రూ.6వేలు అందిస్తోంది. రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో రైతులకు అందుతుంది. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో పీఎం కిసాన్ రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలి? వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఏం చేస్తే వాయిదా డబ్బులు తిరిగి పొందవచ్చు? ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.
ఈ అర్హతలు తప్పనిసరి :
పీఎం కిసాన్ పథం ప్రయోజనాలు పొందాలంటే ఈ అర్హతలు రైతులకు తప్పనిసరి. చిన్న సన్నకారు రైతులు మాత్రమే పొందగలరు. రైతులు అర్హత కలిగినా రూ. 2వేలు అందకపోవచ్చు. మీ అకౌంట్లలో కూడా రూ. 2వేలు పడకపోతే ఈమెయిల్, ఫోన్ ద్వారా మీ ఫిర్యాదులను చేయొచ్చు.
రూ. 2వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేయండి :
లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేయాలంటే? :
ఈ రైతులకు రూ. 2వేలు పడవు :
పీఎం కిసాన్ పథకం కింద భార్యాభర్తలిద్దరూ ప్రయోజనాలను పొందలేరు. రైతు కుటుంబంలో ఒకరైనా టాక్స్ చెల్లిస్తే కూడా ఈ పథకం పొందలేరు. రైతు మరొక రైతు నుంచి భూమిని కౌలుకు తీసుకొంటే కూడా పథకాన్ని పొందలేరు. పీఎం కిసాన్‌కు సొంత భూమి ఉండాలి. అప్పుడే ఆ రైతులకు ప్రయోజనాలు అందుతాయి.
e-KYC పూర్తి చేయలేదా? :
పీఎం కిసాన్ 20వ విడత పొందాలంటే రైతులు e-KYC చేయించుకోవడం తప్పనిసరి. e-KYC ప్రక్రియను పూర్తి చేయని రైతులకు రూ. 2వేలు పడవు. దాంతో వాయిదాల డబ్బులు నిలిచిపోతాయి. ఈ-కేవైసీని పూర్తి చేయనివారు వెంటనే పూర్తి చేయండి. తద్వారా ఆగిపోయిన డబ్బులు పడే అవకాశం ఉంటుంది.
ఎవరికి ఫిర్యాదు చేయాలంటే? :