PM Kisan Yojana 21st instalment
PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్.. అతి త్వరలోనే పీఎం కిసాన్ 21వ విడత విడుదల కానుంది. లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ 21వ విడత రూ. 2వేలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులకు రూ. 2వేలు అందుకోగా మిగతా రైతులంతా పీఎం కిసాన్ డబ్బులు రావాల్సి ఉంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిన రైతులు (PM Kisan Yojana) ఏడాదికి 3 సార్లు రూ. 2వేలు చొప్పున అందుకుంటారు. మొత్తం సంవత్సరానికి రూ. 6వేలుగా ఆర్థిక సాయాన్ని అందుకుంటారు. ఈ ఏడాదిలో పీఎం కిసాన్ 21వ విడత విడుదలకు సంబంధించి షెడ్యూల్ మొదలైంది. రైతులు 21వ విడత డబ్బులను త్వరలోనే అందుకోనున్నారు.
ఈ రైతులకే 21వ విడత విడుదల :
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2.7 మిలియన్లకు పైగా రైతులకు పీఎం కిసాన్ యోజన 21వ విడతను విడుదల చేసింది. సెప్టెంబర్ 26న కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లోని రైతుల బ్యాంకు ఖాతాలకు 21వ విడతను విడుదల చేసింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ఈ 3 రాష్ట్రాల్లోని రైతులు భారీగా నష్టాలను చవిచూశారు.
21వ విడత ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్ యోజనలో చేరిన రైతులు 21వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ 20వ విడత ఆగస్టు 2, 2025న విడుదలైంది. 9 కోట్లకు పైగా అర్హత కలిగిన రైతులు ఈ విడత ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు. గతంలో విడుదల చేసిన వాయిదాల మాదిరిగా ప్రతి విడత దాదాపు ప్రతి 4 నెలలకు విడుదల అవుతుంది.
దీని ప్రకారం.. పీఎం కిసాన్ 21వ విడత ఈ నవంబర్‌లోనే విడుదల అవుతుంది. బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 21వ విడతను లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయొచ్చునని భావిస్తున్నారు. అయితే, దీనిపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.
ఈ పనులను జాగ్రత్తగా పూర్తి చేయండి :
పీఎం కిసాన్ యోజన కింద వాయిదా బెనిఫిట్స్ పొందడానికి రైతులు భూమి ధృవీకరణ, ఈ-కేవైసీ, ఆధార్ లింకింగ్ వంటి అవసరమైన పనులను పూర్తి చేయాలి. ఇలా చేయడంలో విఫలమైతే వాయిదాల ద్వారా పొందే బెనిఫిట్స్ కోల్పోయే అవకాశం ఉంది.