PM Surya Ghar : కేంద్ర ఉచిత విద్యుత్ పథకం.. సబ్సీడీతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు.. అర్హతలేంటి? ఎలా అప్లయ్ చేయాలంటే?

PM Surya Ghar Yojana : పీఎం సూర్యా ఘర్ ముఫ్త్ బిలిజి పథకానికి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసింది కేంద్రం. సుమారు రూ.4770 కోట్ల సబ్సిడీ అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

PM Surya Ghar Yojana

PM Surya Ghar Yojana : మీ ఇంటికప్పుపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటారా? అయితే, మీకోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది. 2024లో ఫిబ్రవరి 13న కేంద్రం పీఎం సూర్యా ఘర్ ముఫ్త్ బిజిలి అనే పేరుతో ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

అప్పటినుంచి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు. ఈ పథకం ప్రారంభమైన ఏడాది నుంచి 10.09 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసినట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.

Read Also : Best SIP Plans : డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..? ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలిస్తే.. 20 ఏళ్లలో కోటీశ్వరుడు అవ్వడం ఖాయం..!

అయితే, ఈ ఉచిత విద్యుత్ పథకానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా చందాదారుల సంఖ్య పెరుగుతోంది. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్తును ఏర్పాటు చేసేందుకు సబ్సిడీ కూడా అందిస్తోంది.

ఈ పథకం కింద విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు. అక్టోబర్ నాటికి 20 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2027 నాటికి కోటి ఇళ్లకు సౌర విద్యుత్ సరఫరా అందించాలని యోచిస్తోంది.

అసలు ఈ పథకం ఏంటి?
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఇళ్లలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేందుకు 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా, 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలతో సహా ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తోంది.

పథకం ప్రయోజనాలివే :

ప్రధాన బ్యాంకులు అందించే రుణ పథకం ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • 78,000 వరకు సబ్సిడీ.
  • 6 లక్షల వరకు రుణాలు, ROI లేదా వడ్డీ రేటు ఏడాదికి కేవలం 6.75 శాతం
  • 2 లక్షల వరకు రుణాలకు ఆదాయ పత్రాలు అవసరం లేదు.
  • ఖర్చులో 90 శాతం వరకు ఫైనాన్స్ పొందవచ్చు.

ఎవరు అర్హులంటే? :

  • సోలార్ ప్యానెల్ ఏర్పాటు ఇంటివారు భారతీయ పౌరుడై ఉండాలి.
  •  ఆ కుటుంబం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన పైకప్పు కలిగిన ఇళ్లు ఉండాలి.
  •  ఇంటికి ధృవీకరించిన విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
  •  ఆ కుటుంబం సోలార్ ప్యానెల్ వంటి మరే ఇతర సబ్సిడీని పొంది ఉండకూడదు.

ఎలా దరఖాస్తు చేయాలి? :

Read Also : MG Cars Discounts : కొత్త కారు కావాలా? ఎంజీ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 5 లక్షలపైనే తగ్గింపు.. నెవర్ బీఫోర్ ఆఫర్లు భయ్యా..!

  • అధికారిక వెబ్‌సైట్‌ను (https://pmsuryaghar.gov.in/) విజిట్ చేయండి.
  • కన్స్యూమర్ ట్యాబ్‌కి వెళ్లి “Apply Now” ఎంచుకోండి (లేదా) లాగిన్ డ్రాప్‌డౌన్ మెనుని ఓపెన్ చేసి “Consumer Login” ఎంచుకోండి.
  • మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి వెరిఫై చేసుకోండి. పేరు, రాష్ట్రం, ఇతర వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ ఇమెయిల్ ఐడీని వెరిఫై చేసుకోండి. మీ ప్రొఫైల్‌ను సేవ్ చేయండి.
  • వెండర్ కోసం, మీ అవసరాన్ని బట్టి Yes లేదా No ఆప్షన్ ఎంచుకోండి.
  • ‘Apply for Solar Rooftop’పై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా డిస్కామ్, ఇతర వివరాలను అందించండి.
  • విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOM) ఈ వివరాలను ధృవీకరించి సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతాయి.
  • ఆమోదం తర్వాత, వెండర్ ఎంచుకుని, సబ్సిడీ కోసం బ్యాంక్ వివరాలను ఇవ్వాలి.