Best SIP Plans : డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..? ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలిస్తే.. 20 ఏళ్లలో కోటీశ్వరుడు అవ్వడం ఖాయం..!

Best SIP Plans : మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి. రెగ్యులర్ SIP, స్టెప్-అప్ SIP.. ఈ రెండింటిలో 20 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే రూ. 1 కోటి వరకు సంపాదించుకోవచ్చు. ఇదేలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.

Best SIP Plans : డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..? ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలిస్తే.. 20 ఏళ్లలో కోటీశ్వరుడు అవ్వడం ఖాయం..!

Best SIP Plans

Updated On : March 14, 2025 / 5:17 PM IST

Best SIP Plans : డబ్బులు ఎలా సంపాదించాలి? ఏయే మార్గాల్లో తొందరగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే.. పెట్టుబడి ఒక్కటే సరైన మార్గం. మీరు ఇప్పటినుంచే చిన్న మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

Read Also : iPhone 17 Series : వావ్.. వండర్‌ఫుల్.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ వచ్చేస్తోంది.. 5 బిగ్ అప్‌గ్రేడ్స్‌‌ ఇవేనట.. చివరిది గేమ్ ఛేంజర్ ఫీచర్..!

ప్రత్యేకించి మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెడితే అధిక లాభాలను పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్ SIPలో దీర్ఘకాలం పాటు చిన్న మొత్తాలను పెట్టుబడి పెడితే మీరు కొద్దికాలంలోనే కోటీశ్వరులు కావొచ్చు. మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

అందులో మొదటిది రెగ్యులర్ SIP, రెండవది స్టెప్-అప్ SIP అంటే.. టాప్ అప్ అనమాట. 20ఏళ్లలో ఈ రెండింటిలో పెట్టుబడి పెడుతూ వెళ్లారంటే.. రూ. 1 కోటి వరకు డబ్బులను సంపాదించుకోవచ్చు. అయితే, ఈ రెండు పద్ధతుల్లో మీరు ప్రతి నెలా ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రెగ్యులర్ SIPతో రూ. 1 కోటి వరకు సంపాదన :
రెగ్యులర్ SIPలో ప్రతి నెలా ఎస్ఐపీలో మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. మీరు 20 ఏళ్లలో రూ. 1 కోటి వరకు సంపాదించాలనుకుంటే.. 20 ఏళ్ల పాటు నిరంతరం SIPలో ప్రతి నెలా రూ. 11వేలు పెట్టుబడి పెట్టాలి. ఇలా చేస్తే.. మీరు 20 ఏళ్లలో మొత్తం రూ. 26,40,000 పెట్టుబడి పెట్టవచ్చు. 12 శాతం రాబడి రేటుతో మీకు మొత్తం రూ. 74,78,431 వడ్డీ మాత్రమే లభిస్తుంది. 20 ఏళ్ల తర్వాత మీకు మొత్తం రూ. 1,01,18,431 పైనే చేతికి వస్తుంది.

కోటి కోసం SIP టాప్ తీసుకోండి :
స్టెప్-అప్ SIP అంటే.. టాప్-అప్ ఎస్ఐపీ అని కూడా అంటారు. ఈ విధంగా నెలవారీ SIPని వార్షిక ప్రాతిపదికన 10శాతం పెంచుకోవాలి. మీరు ప్రతి నెలా రూ. 5వేలు SIPతో ప్రారంభిస్తే.. ప్రతి ఏడాది 10 శాతం పెంచాల్సి ఉంటుంది. 5వేలలో 10 శాతం అంటే.. రూ. 500 అనమాట..

Read Also : MG Cars Discounts : కొత్త కారు కావాలా? ఎంజీ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 5 లక్షలపైనే తగ్గింపు.. నెవర్ బీఫోర్ ఆఫర్లు భయ్యా..!

అప్పుడు మీకు వచ్చే ఏడాది SIPలో ప్రతి నెలా రూ. 5500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దంతో స్టెప్-అప్ SIP ద్వారా రూ.1 కోటి వరకు సంపాదించవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. నెలకు కేవలం రూ.5,500 SIPతో పెట్టుబడి పెట్టడమే.

అలా వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. మీరు ఇలా 20 ఏళ్లలో రూ. 37,80,150 ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో మీకు వడ్డీగా రూ. 64,67,111 వస్తుంది. తద్వారా 20 ఏళ్ల తర్వాత మీకు రూ. 1,02,47,261 కోటిపైనే కూడబెడతారు..