PM Surya Ghar : పీఎం సూర్య ఘర్ యోజన.. ఇలా చేస్తే మీ ఇంట్లో నెలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. ఫుల్ డిటెయిల్స్!
PM Surya Ghar Yojana : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ కింద 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పొందవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 75 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు దిశగా కేంద్ర అడుగులు వేస్తోంది. ఈ పథకం ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- June 5, 2026 / 07:03 PM IST
PM Surya Ghar Yojana
- ఈ సమ్మర్‌లో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?
- 200 యూనిట్ల నుంచి 300 యూనిట్లకు దాటుతోందా?
- పీఎం సూర్య ఘర్ స్కీమ్ కింద ఫ్రీ కరెంట్ పొందవచ్చు
PM Surya Ghar Yojana : అసలే ఎండాకాలం.. ఏసీలు, కూలర్ల వాడకంతో నెలవారీ కరెంట్ బిల్లు తడిసి మోపెడు అవుతోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నాయి. అయినప్పటికీ సమ్మర్ సీజన్ కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దాంతో ఉచిత కరెంట్ అందే 200 యూనిట్లు దాటుతోంది.
ఫలితంగా మొత్తం కరెంట్ బిల్లు చెల్లించక తప్పదు. ఇలాంటి సమస్యను ఎదుర్కోనే వారికోసం కేంద్ర పథకం అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే.. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana) పథకం.. 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లైఫ్ లాంగ్ అవకాశం పొందవచ్చు.
గతేడాదిలో ఈ పథకం ప్రవేశపెట్టగా 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వాడుకోవచ్చు. ప్రస్తుతం మొత్తం 25 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 2026 డిసెంబర్ వరకు మొత్తం 75 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీమ్ కింద ఫ్రీ కరెంట్ ఎలా పొందాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉచిత విద్యుత్ పథకం ఏంటి? :
ఫిబ్రవరి 2024లో పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 10 మిలియన్ల ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడమే ఈ పథకం లక్ష్యం. ఈ స్కీమ్ కింద అర్హులైన ఫ్యామిలీలు ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి తమ నెలవారీ విద్యుత్ అవసరాలను తగ్గించుకోవచ్చు. తద్వారా గృహాల నెలవారీ ఖర్చులు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 2026 నాటికి ఈ పథకం కింద 26 లక్షలకు పైగా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు ఏర్పాటు అయ్యాయి.
విద్యుత్ బిల్లులు తగ్గుతాయి :
మీ ఇంటికి సోలార్ ప్యానెళ్లు విద్యుత్ ఉత్పత్తితో పాటు నెలవారీ బిల్లు కూడా భారీగా తగ్గిస్తాయి. కొన్నిసార్లు పవర్ బిల్లులు జీరో కూడా రావొచ్చు. నెలకు 300 యూనిట్లు లేదా ఆపై తక్కువ విద్యుత్ వాడే ఫ్యామిలీలు ఈ పథకం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు.
రూ. 78వేల వరకు సబ్సిడీ :
ఈ పథకం కింద సోలార్ సిస్టమ్ ఏర్పాటు ఖర్చును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. 2 కిలోవాట్ల వరకు సిస్టమ్‌లకు మొత్తం ఖర్చులో 60 శాతం వరకు అదనపు 2 నుంచి 3 కిలోవాట్లకు 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది. 3 కిలోవాట్ల సిస్టమ్‌లకు గరిష్టంగా రూ. 78వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. ప్రభుత్వం ప్రకారం.. ఈ పథకం ప్రారంభం నుంచి వేల కోట్ల సబ్సిడీలు లబ్ధిదారుల ఖాతాలకు అందుతాయి.
Read Also : Apple 2026 Lineup : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు 11 కొత్త డివైజ్‌లు రాబోతున్నాయ్!
అధిక విద్యుత్తు ఉత్పత్తితో సంపాదన :
ఈ పథకం కేవలం విద్యుత్తు ఆదా చేయడమే కాదు.. ఇంటి సోలార్ సిస్టమ్, అవసరానికి మించి విద్యుత్తును ఉత్పత్తి అయితే అదనపు విద్యుత్తును నెట్ మీటరింగ్ సిస్టమ్ ద్వారా గ్రిడ్‌కు పంపవచ్చు. తద్వారా వినియోగదారునికి డబ్బులు సంపాదించుకోవచ్చు. సోలార్ సిస్టమ్‌లకు 3 కిలోవాట్ల వరకు సుమారు 7 శాతం వడ్డీ రేటుతో అసురక్షిత రుణాలు కూడా పొందవచ్చు. ప్రారంభ ఖర్చు భారీగా తగ్గుతుంది.
ఎవరు అప్లయ్ చేయొచ్చు? అసలు ప్రాసెస్ ఏంటి? :
ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ కోసం దరఖాస్తుదారులు ఈ కింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
- భారత పౌరులై ఉండాలి
- సోలార్ ప్యానెళ్ల కోసం పైకప్పు
- ఇల్లు, విద్యుత్ కనెక్షన్ తప్పక ఉండాలి
- అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే
- రాష్ట్రం, డిస్కామ్, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ
- జాతీయ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు
డిస్కామ్ అప్రూవల్ తర్వాత రిజిస్టర్డ్ వెండర్ ద్వారా సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయించవచ్చు. చెక్ నెట్ మీటరింగ్, సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో పడుతుంది. వెరిఫికేషన్ పూర్తి అయిన 15 రోజులలోపు సబ్సిడీ ఖాతాలో జమ అవుతుంది.
