Post Office Scheme : ఈ పోస్టాఫీస్ స్కీమ్‌తో అసలు కన్నా ఎక్కువ వడ్డీ.. మీరు రూ. 10లక్షలు పెట్టుబడి పెడితే రూ.20 లక్షల పైనే వడ్డీ పొందొచ్చు!

Post Office Scheme : మీరు పోస్టాఫీస్ పథకం కింద పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? మీరు ఇలా పెట్టుబడి పెడితే అసలు కన్న ఎక్కువ వడ్డీని పొందవచ్చు. రూ. 10 లక్షలు పెట్టుబడితో రూ.20 లక్షలకు పైగా వడ్డీ పొందవచ్చు తెలుసా?

Post Office Scheme : ఈ పోస్టాఫీస్ స్కీమ్‌తో అసలు కన్నా ఎక్కువ వడ్డీ.. మీరు రూ. 10లక్షలు పెట్టుబడి పెడితే రూ.20 లక్షల పైనే వడ్డీ పొందొచ్చు!

Post Office Scheme

Updated On : February 12, 2025 / 12:31 PM IST

Post Office Scheme : పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీ వస్తుందా? చూస్తున్నారా? మీకోసం పోస్టు ఆఫీసు ఫిక్స్‌‌డ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా అసలు కన్నా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. మీరు చేయాల్సిందిల్లా పెట్టుబడి పెట్టడమే.. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులలో కూడా వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఒకటి.

Read Also : 8th Pay Commission : 8వ వేతన సంఘం కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరగనున్నాయంటే?

ఒక్క మాటలో చెప్పాలంటే.. పోస్టాఫీసు (FD)గా చెప్పవచ్చు. పోస్టాఫీసులో 1 ఏడాది నుంచి 5 ఏళ్ల కాలపరిమితి కలిగిన FD ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 5 ఏళ్ల ఎఫ్‌డీపై 7.5 శాతం వడ్డీ అందుకోవచ్చు. అంతేకాదు.. మీరు ఆదాయపు పన్ను చట్టం 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు కోరుకుంటే.. ఈ పథకంలో వడ్డీ ద్వారా మీరు రెండు రెట్లు అసలు మొత్తాన్ని సంపాదించవచ్చు. మీ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకోవచ్చు.

ఇలా చేయండి చాలు :
పోస్టాఫీసులో మీ డబ్బును మూడు రెట్లు పెంచుకోవాలంటే.. మీరు 5 ఏళ్ల ఎఫ్‌డీ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. అది ముగియక ముందు పొడిగించాలి. మీరు ఈ పొడిగింపును వరుసగా రెండుసార్లు చేయించుకోవాలి. అంటే మీరు ఈ FDని 15 ఏళ్ల పాటు కొనసాగించాలని గమనించాలి.

రూ. 10 లక్షల పెట్టుబడిపై రూ. 20 లక్షలకు పైగా వడ్డీ :
మీరు ఈ ఫోస్టాఫీసు ఎఫ్‌డీలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.5 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్లలో ఈ మొత్తంపై మీకు రూ. 4,49,948 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా మొత్తం రూ. 14,49,948 అవుతుంది. కానీ, మీరు ఈ పథకాన్ని 5 సంవత్సరాలు పొడిగిస్తే.. మీకు వడ్డీగా రూ. 11,02,349 మాత్రమే లభిస్తుంది.

10 ఏళ్ల తర్వాత మీ మొత్తం రూ. 21,02,349 అవుతుంది. అది కాల పరిమితికి ముందు మీరు దాన్ని మరోసారి పొడిగించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో 15వ సంవత్సరంలో, మీరు రూ. 10 లక్షల పెట్టుబడిపై వడ్డీగా రూ. 20,48,297 పొందుతారు. అదే మెచ్యూరిటీ సమయంలో మీకు రూ. 30,48,297 లభిస్తుంది. మీరు మీ అసలు కన్నా రెట్టింపు వడ్డీని పొందవచ్చు. మీ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకోవాలని అనమాట.

Read Also : Google Pixel 9 : ఆఫర్ భలే ఉంది భయ్యా.. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ.9వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

మెచ్యూరిటీని ఎలా పొడిగించాలి :
పోస్ట్ ఆఫీస్ ఒక ఏడాది FD మెచ్యూరిటీ తేదీ నుంచి 6 నెలల లోపు పొడిగించవచ్చు. 2 ఏళ్ల ఎఫ్‌డీ మెచ్యూరిటీ కాలం నుంచి 12 నెలల లోపు పొడిగించవచ్చు. 3 ఏళ్ల నుంచి 5ఏళ్ల FD పొడిగింపు కోసం, మెచ్యూరిటీ కాలం నుంచి 18 నెలల లోపు పోస్ట్ ఆఫీస్‌కు తెలియజేయాలి. అంతేకాదు.. మీరు అకౌంట్ తెరిచే సమయంలో మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ పొడిగింపు కోసం కూడా అభ్యర్థించవచ్చు. మెచ్యూరిటీ రోజున సంబంధిత టీడీ అకౌంట్‌కు వర్తించే వడ్డీ రేటు పొడిగించిన కాలానికి వర్తిస్తుంది.

ఇతర పోస్టాఫీసు ఎఫ్‌డీలపై వడ్డీ ఎంతంటే? :
వివిధ పోస్టాఫీసు ఎఫ్‌డీలు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తాయి. ఒక ఏడాది ఎఫ్‌డీపై సంవత్సరానికి 6.90శాతం వడ్డీ, 2 ఏళ్ల ఎఫ్‌డీపై సంవత్సరానికి 7.00శాతం వడ్డీ, 3 ఏళ్ల ఎఫ్‌డీపై సంవత్సరానికి 7.10శాతం వడ్డీ, 5 సంవత్సరాల ఎఫ్‌డీపై సంవత్సరానికి 7.50శాతం వడ్డీ పొందవచ్చు.