8th Pay Commission : 8వ వేతన సంఘం కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరగనున్నాయంటే?

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. 8వ వేతన సంఘం 2026లో అమలు అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంతవరకు పెరగవచ్చుననే చర్చ జరుగుతోంది. ఉద్యోగుల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.

8th Pay Commission : 8వ వేతన సంఘం కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరగనున్నాయంటే?

8th Pay Commission

Updated On : February 12, 2025 / 11:46 AM IST

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు అతి త్వరలో తెరపడనుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం గురించి చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దీనిపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. 8వ వేతన సంఘం (8వ CPC) కోసం ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రక్రియను ప్రారంభించనుంది.

అందిన సమాచారం ప్రకారం.. వేతన సంఘం ఏప్రిల్ 2025 నుంచి 8వ వేతన సంఘం ప్రక్రియ మొదలు కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2014లో 7వ వేతన సంఘం ఏర్పాటు అయింది. కేంద్ర ప్రభుత్వం 2016లో సిఫార్సులను అమలు చేసింది.

Read Also : 8th Pay Commission : కీలక అప్‌డేట్.. ఇదే జరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. కనీస వేతనం ఎంత పెరగనుందో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం గత నెలలో 8వ వేతన సంఘాన్ని ప్రకటించింది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) ఇస్తుంది. అంతేకాకుండా, ప్రభుత్వం ప్రతి ఏడాదిలో రెండుసార్లు డీఏను సవరిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం.. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు వేతన సవరణల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

8వ వేతన సంఘం అమలు ఎప్పుడంటే? :
మునుపటి వేతన కమిషన్లను పరిశీలిస్తే.. ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త కమిషన్ వస్తుంది. సిఫార్సులు అమలు అవుతాయి. 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి కొత్త కమిషన్ పదవీకాలం జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వం దీని అమలకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేస్తోంది. 8వ వేతన సంఘం నిబంధనలు (TOR) కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత, కమిషన్ ఏప్రిల్ 2025 నుంచి పనిని ప్రారంభించవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సూచించారు.

ఆ తరువాత కమిషన్ జీతం పెంపు ఫార్ములా, ఫిట్‌మెంట్ కారకాన్ని పరిశీలిస్తుంది. కానీ, సిఫార్సులను అమలు చేసేందుకు దాదాపు 18 నెలలు పడుతుంది. ఆపై 8వ వేతన సంఘం అమలుకు మరికొంత సమయం పట్టవచ్చు.

జీతాల పెంపు ఎలా ఉంటుంది? :
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే.. ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్ ఎంతవరకు పెరుగుతుందనేది పెద్ద చర్చ నడుస్తోంది. 100 శాతం నుంచి 186 శాతం కనీస వేతనం పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. మరికొందరు 20 శాతం నుంచి 30 శాతం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు.

వాస్తవానికి ఎంత మొత్తంలో పెరుగుతుందనే సందిగ్ధంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. ప్రస్తుతం, 7వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక జీతం రూ.18వేలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక పెన్షన్ రూ.9వేలుగా ఉంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే :
కొత్త వేతన సంఘం ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ 1.92 నుంచి 2.08 మధ్యలో ఉంటుందని అంచనా. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంతగా ఉంటే అన్ని రెట్లు వరకు కనీస వేతనం పెరిగే అవకాశం ఉంది. 2026 జనవరి నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రానుంది. అప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 60 శాతానికి చేరనుంది. ప్రస్తుత కనీస వేతనం 18 వేలుగా ఉండగా. డీఏ సహా రూ. 28,800 అవుతుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నెలకు కనీస వేతనం (రూ.) కనీస ప్రాథమిక పెన్షన్ (రూ.)
 1.92 రూ. 34,560 రూ. 17,280 / నెల
 2 రూ. 36,000 రూ. 18,000
 2.08 రూ. 37,440 రూ. 18,720 / నెల
 2.86 రూ. 51,480 రూ. 25,740 / నెల

ఒకవేళ 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 గా సెట్ చేస్తే.. ఆపై కనీస వేతనం 20 శాతం పెరిగి రూ. 34,560 అవుతుంది. కనీస ప్రాథమిక పెన్షన్ నెలకు రూ. 17,280 అవుతుంది. అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2 శాతమైతే.. కనీస వేతనం 36వేలు ఉంటుంది. కనీస ప్రాథమిక పెన్షన్ రూ. 18వేలు అవుతుంది. అలాగే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.08 శాతమైతే కనీస వేతనం 30 శాతంగా పెరిగి రూ. 37,440 అవుతుంది.

ప్రాథమిక పెన్షన్ నెలకు రూ.18,720గా ఉంటుంది. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా ఉంటే కనీస వేతనం నెలకు రూ. 51,480 అవుతుంది. అంటే.. 80 శాతం మేర పెంపు ఉంటుంది. కనీస ప్రాథమిక పెన్షన్ నెలకు 25,740 అవుతుంది. దీనికి డీఏ కలిపితే 1.92 ఫిట్‌‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే 92 శాతం, 2.08 శాతం అయితే 108 శాతం, 2.86 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అందిస్తే 186 శాతం జీతం పెంపు ఉంటుంది.

Read Also : iPhone 16 Plus : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్.. ఈ ఐఫోన్ మోడల్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు కూడా.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

అంతేకాకుండా, భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 1.92 లేదా 2.08 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఆమోదించవచ్చని అన్నారు. అయితే, NC-JCM సెక్రటరీ స్టాఫ్ శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 కన్నా తక్కువ ఉండకూడదని అన్నారు.

“ఫిబ్రవరి 15, 2025 నాటికి 8వ వేతన సంఘం ఏర్పాటు అవుతుందని భావిస్తున్నాం. కమిషన్ నివేదిక నవంబర్ 30 నాటికి తుది రూపం దాల్చుతుంది. తదుపరి పరిశీలన కోసం ప్రభుత్వం డిసెంబర్‌లో సమీక్షిస్తుంది. కొత్త వేతన సంఘం జనవరి 2026 నుంచి దేశంలో అమలు కావచ్చు”అని ఆయన పేరొన్నారు.

ఎంత మంది ఉద్యోగులకు ప్రయోజనం :
– ఈ వేతన సంఘం వల్ల 50 లక్షలకు పైగా కేంద్ర ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు.
– 65 లక్షలకు పైగా పెన్షనర్లు కూడా పెన్షన్ పెంపు ప్రయోజనాన్ని పొందుతారు.