8th Pay Commission : కీలక అప్‌డేట్.. ఇదే జరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. కనీస వేతనం ఎంత పెరగనుందో తెలుసా?

8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఏకంగా 10 శాతం నుంచి 30 శాతం మధ్య పెరగనుంది.

8th Pay Commission : కీలక అప్‌డేట్.. ఇదే జరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. కనీస వేతనం ఎంత పెరగనుందో తెలుసా?

8th Pay Commission

Updated On : January 30, 2025 / 12:43 AM IST

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మతిరిగే అప్‌డేట్.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుపై అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటివరకూ, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, జీతభత్యాలు ఎంతమేర పెరగనున్నాయి? అసలు కనీస వేతనం ఎంతగా పెరగవచ్చు అనేది ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఎంతవరకు పెరిగే అవకాశం ఉందో దాదాపు క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే.. 8వ వేతన సంఘం ఈ ఏడాది చివరి నాటికి నివేదికను అందజేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

Read Also : BOM Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు పడ్డాయి.. పరీక్ష లేకుండా జాబ్ కొట్టొచ్చు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

తాజా నివేదికల ప్రకారం.. ఉద్యోగుల కనీస వేతనం ఏకంగా 10 శాతం నుంచి 30 శాతం మధ్య పెరిగే అవకాశం ఉంది. అంటే.. భారీగా 186 శాతం పెంపు ఉండొచ్చునని అంచనా. 8వ వేతన సంఘం ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.6 నుంచి 2.85కు పెరుగుతుందని అంచనా. ఇదేగానీ జరిగితే ఉద్యోగుల కనీస వేతనం 25 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రూ. 18 వేల కనీస వేతనం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతానికి చేరితే వేతనాలు కూడా రూ. 40 వేల నుంచి రూ. 45 వేలు అవుతుందని సమాచారం.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరగొచ్చుంటే? :
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను దీని ఆధారంగానే లెక్కిస్తుంటారు. ద్రవ్యోల్బణ, ఆర్ధిక పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా నిర్ణయిస్తారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరిగితే ఉద్యోగుల జీతభత్యాలు కూడా అంతే పెరుగుతాయి. 2.86 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పొందడం అసాధ్యం ”అని భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను నిర్ణయించేందుకు జనవరి 1, 2026 నాటికి పే కమిషన్ బేసిక్ పే ప్లస్ డియర్‌నెస్ అలవెన్స్ (DA)ని పరిగణనలోకి తీసుకుంటుందని చంద్ర గార్గ్ చెప్పారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది రివైజ్డ్ పే మ్యాట్రిక్స్ కింద కొత్త జీతాన్ని లెక్కించడానికి ప్రస్తుత ప్రాథమిక వేతనానికి వర్తించే గుణకంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం, డీఏ (DA) 53 శాతం (జూలై 1, 2024 నాటికి)గా ఉంది. జనవరి 1, 2026 వరకు డీఏని గణించడానికి, మరో రెండు వాయిదాలను చేర్చాలి. అందులో ఒకటి జనవరి 1, 2025న, మరొకటి జూలై 1, 2025న చెల్లించాలి. జనవరి 1, 2026కి డీఏ 7 శాతం పెరిగినట్లు అవుతుంది.

అంటే.. దాదాపు 60 శాతం ఉంటుందని గార్గ్ అభిప్రాయపడ్డారు. “సాధారణంగా, పే కమీషన్లు 15 శాతం నుంచి 30 శాతం వరకు పెంచాలని సిఫారసు చేస్తాయి. గత వేతన సంఘం దాదాపు 14-15 శాతం పెంచాలని సిఫార్సు చేసింది. నా అంచనా ప్రకారం.. 1.6 బేస్ ఫ్యాక్టర్‌కి వర్తించే అదనపు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 10 నుంచి 30 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది” అని ఆయన చెప్పారు.

బేస్ ఫ్యాక్టర్ 1.6 లేదా 160లో 20 శాతం తీసుకుంటే.. మనకు 32 వస్తుంది. 32 నుంచి 160కి జోడిస్తే రివైజ్డ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 192 లేదా 1.92 వస్తుంది అనమాట. ఉదారంగా 30 శాతం పెరుగుదలను ఊహించినట్లయితే.. 160లో 30 శాతం 48. దీన్ని బేస్ ఫ్యాక్టర్‌కి జోడిస్తే.. మనకు 208 లేదా రివైజ్డ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.08 వస్తుంది.

అసలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92-2.08 మధ్య ఉండే అవకాశం ఉందని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. 7వ వేతన సంఘం ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. ఇది కనీస మూల వేతనాన్ని రూ.7వేల నుంచి రూ.18వేలకి పెంచింది.

Read Also : RRB NTPC 2025 : రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష తేదీలపై ఉత్కంఠ.. ఎంపిక ప్రక్రియ, ఏ పోస్టుకు జీతం ఎంతో తెలుసా?

8వ వేతన సంఘం
8వ పే కమీషన్ ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86కి పెరుగుతుందని అంచనా. ఇది కనీస ప్రాథమిక వేతనాన్ని రూ. 51,480కి పెంచుతుంది. అంటే.. ప్రస్తుత రూ. 18వేల కన్నా 186 శాతం పెరిగింది.

7వ పే కమిషన్ పదవీకాలం :
ప్రస్తుత 7వ పే కమిషన్ పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా జనవరి 2026 నుంచి అధిక పెన్షన్ పొందనున్నారు.

కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత 7వ వేతన సంఘం 2014లో ఏర్పడింది. దాని సిఫార్సులు జనవరి 1, 2006న 6వ వేతన సంఘం అమలులోకి వచ్చిన సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2016 జనవరి నుంచి అమలులోకి వచ్చాయి.