Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? ప్రతి ఒక్కరూ తమ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బులు సంపాదించాలని కోరుకుంటారు.
Read Also : Lava Smartphone : లావా ఫోన్ అదుర్స్.. ఐఫోన్ 16 డిజైన్‌తో ఖతర్నాక్ ఫీచర్లు.. ధర కేవలం రూ.6499 మాత్రమే..!
కానీ, ఏయే పథకంలో పెట్టుబడి పెట్టాలి? ఎక్కువ లాభం రావాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది పెద్దగా అవగాహన ఉండదు. అదే పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు.
ప్రస్తుతం, పోస్టాఫీస్ అనేక రకాల పథకాలను అందిస్తోంది. ఇందులో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ పథకాలన్నీ ప్రభుత్వ పథకాలే కాదు.. చాలా సురక్షితమైనవి కూడా. పోస్టాఫీస్ FDలో ఈ పథకంలో 5 ఏళ్లు పెట్టుబడి పెడితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పోస్టాఫీస్ ఫిక్స్ డ్ డిపాజిట్ (FD):
పోస్టాఫీస్ FDలో వివిధ కాలపరిమితి FDలలో పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేట్లు కూడా కాలపరిమితిని బట్టి మారుతూ ఉంటాయి. మీరు 5 ఏళ్ల కాలపరిమితికి పోస్టాఫీస్ FDలో పెట్టుబడి పెడితే.. మీకు 7.5 శాతం వడ్డీ రేటుతో రాబడి లభిస్తుంది.
ఇందులో రూ. 7 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీపై మొత్తం రూ. 10,14,964 లభిస్తుంది. మీకు మొత్తం రూ. 3,14,964 లాభం వస్తుంది.
పోస్టాఫీసు కస్టమర్లకు 5 ఏళ్ల కాలపరిమితితో FDలపై 7.5 శాతం వడ్డీ రేటు రాబడిని అందిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని 3 రెట్లు పెంచేందుకు ఈ FDని 2 రెట్లు పొడిగించాలి.
పోస్టాఫీసులోని 5 ఏళ్ల FDలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 2,89,990 లభిస్తుంది. ఇప్పుడు ఈ FDని తదుపరి 5 ఏళ్లకు మరోసారి పొడిగించాలి.
మీరు మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 4,20,470 పొందుతారు. ఇప్పుడు, ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ వచ్చే 5 ఏళ్లకు ఒకసారి పొడిగించాలి.
మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 6,09,370 పొందవచ్చు. రూ. 2 లక్షల పెట్టుబడిని పూర్తి మొత్తం రూ. 6 లక్షలకు మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు 15 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టాలి.