Lava Smartphone : లావా ఫోన్ అదుర్స్.. ఐఫోన్ 16 డిజైన్‌తో ఖతర్నాక్ ఫీచర్లు.. ధర కేవలం రూ.6499 మాత్రమే..!
Lava Smartphone : లావా కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. యువ స్టార్ 2 పేరుతో భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ లావా ఫోన్ ఐఫోన్ 16 మాదిరిగా పోలి ఉంటుంది.

Lava Yuva Star 2
Lava Smartphone : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? దేశీయ బ్రాండ్ లావా 5000mAh బ్యాటరీ, ఆకట్టుకునే ఫీచర్లతో బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది.
Read Also : EPFO Password : మీ EPFO పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఎలా రీసెట్ చేయాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
ఈ లావా ఫోన్ బ్యాక్ ప్యానెల్ ఐఫోన్ 16 మాదిరిగా ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. లావా యువ స్టార్ 2 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ వర్టికల్ కెమెరాలను కలిగి ఉంది.
లావా యువ స్టార్ 2 ధర :
లావా యువ స్టార్ 2 ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ సింగిల్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. ధర కేవలం రూ. 6,499కు కొనుగోలు చేయొచ్చు. కొనుగోలుదారులు రెండు ఆకర్షణీయమైన రేడియంట్ బ్లాక్, స్పార్కింగ్ ఐవరీ కలర్ ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.
వాస్తవంగా అదనంగా ర్యామ్ 8GBకి విస్తరించవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని పెంచవచ్చు. యాప్, మీడియా కోసం మరింత స్టోరేజీని అందిస్తుంది.
లావా యువ స్టార్ 2 స్పెసిఫికేషన్లు :
ఈ బడ్జెట్ ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 2.5D గ్లాస్‌తో 6.75-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. LCD స్క్రీన్‌ను ఉపయోగిస్తుంది.
యూనిసెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజీతో 512GB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్‌లో రన్ అవుతుంది.
లావా యువ స్టార్ 2 డ్యూయల్ సిమ్ కార్డులకు సపోర్టు ఇస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13MP ఏఐ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సెకండరీ 5MP కెమెరా ఉన్నాయి.
సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చి ఉంటుంది. అదనపు ఫీచర్లలో 3.5mm ఆడియో జాక్, FM రేడియో ఉన్నాయి. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇంకా, IP54 రేటింగ్ కలిగి ఉంది.