Post Office Scheme
Post Office Scheme : మీకు జీతం పడిందా? అయితే, మీ జీతం డబ్బులను ఏదైనా మంచి పెట్టుబడి పథకంలో పెట్టండి. ప్రస్తుత రోజుల్లో సంపాదనలో కొద్ది మొత్తాన్ని పెట్టుబడి (Post Office Scheme)పెట్టడం చేయాలి. చాలామంది తమ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే.. మరికొందరు బ్యాంకు FDలలో పెట్టుబడి పెడతారు.
కొంతమంది ప్రభుత్వ పథకాలలో కూడా పెట్టుబడి పెడుతుంటారు. మీరు కూడా పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తే.. ఈ అద్భుతమైన పథకం మీకోసమే.. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం 5 ఏళ్లలో రూ. 6.74 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) :
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (Post Office Scheme) అనేది పోస్టాఫీసు ప్రభుత్వ పథకం. ఈ పథకంలో పెట్టుబడిదారులు తమ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ వడ్డీ రేటు పొందుతారు. ఈ పథకంలో పెట్టుబడిదారులు 7.7 శాతం వడ్డీ రేటుతో రాబడిని పొందవచ్చు. ఈ వడ్డీని ఏటా చెల్లిస్తారు. మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. ఈ పథకంలో మీరు పెట్టుబడిని కేవలం రూ. 1000తో ప్రారంభించవచ్చు.
6.73 లక్షల రాబడి ఎలా? :
మీరు పోస్టాఫీస్ నేషనల్ (Post Office Scheme) సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో మొత్తం రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే.. 5 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.21,73,551 లభిస్తుంది. ఇందులో, వడ్డీ మాత్రమే రూ.6,73,551 వస్తుంది. తద్వారా రూ.6.73 లక్షల లాభం పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ మినహాయింపు రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి మాత్రమే పరిమితమని గమనించాలి.
Note : ఈ సమాచారం కేవలం పెట్టుబడిపై అవగాహన కోసం మాత్రమే.. మీరు పెట్టుబడి పెట్టే ముందు పోస్టాఫీసులో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోండి.