Money Saving Tips : మీకు జీతం పడగానే ఈ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. రూ.కోటి వరకు ఈజీగా సంపాదించొచ్చు..!

PPF Calculator : జీతం పడగానే వెంటనే ఖర్చు చేసేస్తున్నారా? కాస్తా ఆగండి.. మీ డబ్బులను ఇలా పొదుపు చేయండి. కొద్ది కాలంలోనే కోటి రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా..

PPF Calculator

PPF Calculator : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే, మీ డబ్బులను సేవింగ్ చేసుకునేందుకు అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. మీ ఆదాయంలో కొంత మొత్తాన్ని ఇలా సేవింగ్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. జీతం డబ్బులను ఎందులోనైనా పెట్టుబడి పెట్టండి.. చాలు.. కొన్నేళ్లలోనే మీరు కోటి వరకు డబ్బులను అందుకుంటారు.

ఇంతకీ ఎందులో పెట్టుబడి పెడితే మంచిది? అంటారా? మీరు కూడా సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తుంటే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అద్భుతమైన పథకం ఎంచుకోండి. ఇందులో పెట్టుబడిదారులు ప్రభుత్వ హామీతో మంచి రాబడిని పొందుతారు.

Read Also : Fipkart Bikes Sale : బంపర్ ఆఫర్ భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌‌లో ఫోన్లే కాదు.. కొత్త బైకులు కూడా కొనొచ్చు.. KTM, Triumph ఏది కావాలి?.. రేట్లు ఇవే

మార్కెట్ హెచ్చుతగ్గులతో ఈ పథకంపై ప్రభావం ఉండదు. మీరు ఎంతకాలం ఇందులో పెట్టుబడి పెడితే అంత మొత్తంలో డబ్బును సంపాదించుకోవచ్చు. ఈ పథకంలో మీరు ప్రతి నెలా రూ. 3వేలు, రూ. 6వేలు లేదా రూ. 12 వేలు పెట్టుబడి పెడితే.. 25 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బు మీ చేతికి అందుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రూ. 3వేలు జమ చేస్తే ఎంత వస్తుందంటే? :
పీపీఎఫ్ (PPF)లో ప్రతి నెలా రూ. 3వేలు జమ చేస్తే.. ఒక ఏడాదిలో పెట్టుబడి మొత్తం రూ. 36వేలు అవుతుంది. 25 ఏళ్లు నిరంతరం పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 9 లక్షలు ఆదా చేయొచ్చు. ప్రస్తుతం, ప్రభుత్వం పీపీఎఫ్‌పై 7.1 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ రేటు ప్రకారం.. 25 సంవత్సరాలలో మొత్తం అంచనా వడ్డీ రూ. 15,73,924 అవుతుంది. ఈ విధంగా, 25 సంవత్సరాల తర్వాత జమ అయిన మొత్తం రూ. 24,73,924 అవుతుంది.

6వేలతో ఎంత వస్తుందంటే? :
మీరు PPF అకౌంట్‌లో ప్రతి నెలా రూ. 6వేలు జమ చేస్తే.. ఒక ఏడాదిలో రూ. 72వేలు పెట్టుబడి అవుతుంది. 25 ఏళ్లలో డిపాజిట్ చేసిన మొత్తం రూ. 18 లక్షలు అవుతుంది. మీకు దాదాపు రూ. 31,47,847 వడ్డీ వస్తుంది. అంటే.. 25 ఏళ్ల తర్వాత మీ మొత్తం రూ. 49,47,847కి చేరుకుంటుంది.

Read Also : Apple iPhone 16 Pro : సూపర్ ఆఫర్.. లక్ష ఖరీదైన ఆపిల్ ఐఫోన్ 16ప్రో భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే? ఇప్పుడే కొనేసుకోండి!

కోటి వరకు ఎలా సంపాదించాలి? :
మీరు ప్రతి నెలా PPF అకౌంట్‌లో రూ. 12వేలు డిపాజిట్ చేస్తే.. ఒక ఏడాదిలో రూ. 1.44 లక్షలు జమ అవుతాయి. 25 ఏళ్లలో అకౌంట్ డిపాజిట్ మొత్తం రూ. 36 లక్షలు అవుతుంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై 7.1శాతం వడ్డీ రేటుతో రూ. 62,95,694 వడ్డీ (అంచనా) లభిస్తుంది. ఈ విధంగా, 25 సంవత్సరాల తర్వాత మీ వద్ద మొత్తం రూ. 98,95,694 అంటే.. దాదాపు రూ. 1 కోటి డబ్బు చేతికి అందుతుంది.