Fipkart Bikes Sale : బంపర్ ఆఫర్ భయ్యా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్లే కాదు.. కొత్త బైకులు కూడా కొనొచ్చు.. KTM, Triumph ఏది కావాలి?.. రేట్లు ఇవే
Fipkart Bikes Sale : ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్ వంటి అనేక టూవీలర్ బ్రాండ్ బైకు అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

Now buy KTM, Triumph bikes
Fipkart Bikes Sale : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీరు బైక్ కోసం ఏ షోరూంకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చొనే ఫ్లిప్‌కార్ట్‌లో నచ్చిన కొత్త బైక్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మీ ఇంటికే బైక్ డెలివరీ అవుతుంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ కొత్త బైకులను విక్రయిస్తోంది.
మీకు నచ్చిన కొత్త బైక్ కొనేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ షాపింగ్ అనేది ప్రారంభంలో లైఫ్ స్టయిల్, నిత్యావసర వస్తువులకే పరిమితం కాగా, గత కొన్ని దశాబ్దాలుగా ఆన్‌లైన్ రిటైల్ ప్రపంచం మరింత అడ్వాన్స్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా వాహనాలను కొనుగోలు చేయొచ్చు.
ప్రముఖ ద్విచక్ర వాహన బ్రాండ్‌లలో హీరో, బజాజ్, టీవీఎస్ బైకులను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఈ జాబితాలో ఇటీవలే కేటీఎం, ట్రయంఫ్ వచ్చి చేరాయి. ఈ రెండు బ్రాండ్లు బజాజ్ ఆటో భాగస్వామ్యం ద్వారా భారత మార్కెట్లో బైకులను విక్రయిస్తున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి కేటీఎం, ట్రయంఫ్ మోటార్ సైకిళ్ళు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఇందులో బజాజ్ ఆటో రూపొందించిన 11 మేడ్-ఇన్-ఇండియా ప్రొడక్టులు, 8 KTM, 3 ట్రయంఫ్ మోడల్స్ ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌లో జాబితా అయిన అన్ని బైక్‌లు ఎక్స్-షోరూమ్ ధరకే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ బైకులపై ఎలాంటి డిస్కౌంట్లు లేవని గమనించాలి.
ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి KTM బైక్‌లు :
భారత మార్కెట్లో KTM మొత్తం 3 మోడల్ రేంజ్ బైకులను విక్రయిస్తుంది. అందులో 200, 250, 390 బైక్ మోడల్స్ ఉన్నాయి. 200 డ్యూక్, RC 200, 250 డ్యూక్, 250 అడ్వెంచర్, 390 డ్యూక్, RC 390, 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ X ఉన్నాయి. ఆస్ట్రియన్ బ్రాండ్ ఇటీవల భారత మార్కెట్లో RC 125, 125 డ్యూక్ అనే 125cc మోడళ్లను నిలిపివేసింది.
మోడల్స్ ఎక్స్-షోరూమ్ ధర
- KTM 200 డ్యూక్ : రూ. 2,05,761
- KTM RC 200 : రూ. 2,20,819
- KTM 250 డ్యూక్ : రూ. 2,27,707
- KTM 250 అడ్వెంచర్ : రూ. 2,59,850
- KTM 390 డ్యూక్ : రూ. 2,95,000
- KTM RC 390 : రూ. 3,22,719
- KTM 390 అడ్వెంచర్ X : రూ. 2,91,140
- KTM 390 అడ్వెంచర్ : రూ. 3,67,700
ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ట్రయంఫ్ బైక్స్ :
ప్రస్తుతం భారత మార్కెట్లో ట్రయంఫ్ స్పీడ్ 400, స్పీడ్ T4, స్క్రాంబ్లర్ 400X అనే మూడు బైక్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ 3 మోడళ్లూ ఒకే విధమైన అండర్‌పిన్నింగ్స్, ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఈ రేంజ్‌లో నాల్గో బైకును రిలీజ్ చేసేందుకు ట్రయంఫ్ సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఈ కొత్త బైకును థ్రక్స్టన్ 400గా పిలుస్తారు.
మోడల్స్ ఎక్స్-షోరూమ్ ధర :
ట్రయంఫ్ స్పీడ్ 400 : రూ. 2,41,780
ట్రయంఫ్ స్పీడ్ T4 : రూ.1,98,999
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X : రూ. 2,66,449