Ratan Tata funeral _ India bids farewell to industry legend
Ratan Tata funeral : దేశీయ వ్యాపార రంగంలో ఒక శకం ముగిసింది. ప్రముఖ పారిశ్రామిత్త వేతగా మానవతావాదిగా పేరొందిన రతన్ టాటా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. రతన్ టాటా అంత్యక్రియల్లో ఆయన కుటుంబ సభ్యులు, అనేక రంగాల ప్రముఖులు, వేలాదిగా అభిమానుల నడుమ ముగిశాయి. ఎన్సీపీఏ స్టేడియం నుంచి ముంబైలోని వర్లీ స్మశానవాటిక వరకు టాటా అంతిమయాత్ర కొనసాగింది.
Read Also : Ratan Tata Successor : రతన్ టాటా వారసుడు ఇతడేనా? ఎవరీ నోయల్ టాటా..? ముందున్న అతిపెద్ద సవాళ్లు ఏంటి?
వర్లీ స్మశానవాటికలో రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ముంబై పోలీసులు టాటాను ఉత్సవ గన్ సెల్యూట్‌తో సత్కరించారు. 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి రతన్ టాటా పార్థివ దేహానికి గౌరవ వందనంతో ఘన నివాళులు అర్పించారు. ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటాతో సహా కుటుంబ సభ్యులు, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వంటి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు.
– కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే అంత్యక్రియలకు హాజరయ్యారు.
– శ్మశానవాటికలో పార్సీ సంప్రదాయాలకు అనుగుణంగా రతన్ టాటా అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల తర్వాత, దక్షిణ ముంబైలోని కొలాబాలోని రతన్ టాటా బంగ్లాలో మరో మూడు రోజుల పాటు సంప్రదాయ ఆచారాలను నిర్వహించనున్నారు.
– రతన్ టాటా (86) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. రతన్ టాటా మృతికి సంబంధించి మహారాష్ట్ర సీఎం ఆఫీసు కూడా ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది. ఈరోజు ఎలాంటి రాష్ట్ర వేడుకలు జరగలేదు.
– డిసెంబర్ 28, 1937న ముంబైలో జన్మించిన రతన్ టాటా 1991 నుంచి 2012లో పదవీ విరమణ చేసే వరకు టాటా గ్రూప్‌కు నాయకత్వం వహించారు. ఆ తరువాత టాటా సన్స్‌కు ఎమిరిటస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
రతన్ టాటా దీర్ఘకాల సహచరుడు శాంతనునాయుడు పారిశ్రామికవేత్తకు వీడ్కోలు పలికారు. తన గురువును “లైట్‌హౌస్”తో పోల్చారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి రతన్ టాటా మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లో పరిశ్రమను అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన అపారమైన సహకారాన్ని అందించారంటూ కొనియాడారు.
Read Also : Ratan Tata Documentary : రతన్ టాటా డాక్యుమెంటరీ చూశారా..? ఎక్కడ చూడాలి.. బయోపిక్ వస్తుందా..?