Ratan Tata Documentary : రతన్ టాటా డాక్యుమెంటరీ చూశారా..? ఎక్కడ చూడాలి.. బయోపిక్ వస్తుందా..?

రతన్ టాటాపై ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు.

Ratan Tata Documentary : రతన్ టాటా డాక్యుమెంటరీ చూశారా..? ఎక్కడ చూడాలి.. బయోపిక్ వస్తుందా..?

Ratan Tata Documentary Streaming Details Here Watch in OTT

Updated On : October 10, 2024 / 6:20 PM IST

Ratan Tata Documentary : భారతదేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త రతన్ టాటా నిన్న రాత్రి మరణించగా ఇవాళ కొద్దిసేవుట్టి క్రితమే ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పించారు. వ్యాపారవేత్తగా, సామజిక కార్యకర్తగా ఆయన ఎంతో మంచిపేరు సంపాదించుకున్నారు. ఆయన మరణించడంతో రతన్ టాటాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయితే రతన్ టాటాపై ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ తమ ఓటీటీలో మెగా ఐకాన్స్ అనే ఓ డాక్యుమెంటరీ సిరీస్ చేసింది. ఈ సిరీస్ లో ఎంతోమంది ప్రముఖులపై డాక్యుమెంటరీలు చేసింది. ఈ క్రమంలో మెగా ఐకాన్స్ రెండో సీజన్ లో రతన్ టాటా పై కూడా డాక్యుమెంటరీ చేసారు. ఈ డాక్యుమెంటరీలో రతన్ టాటా మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన బిజినెస్, నానో కార్ ఆలోచన, తన తల్లి గురించి, సినిమా వాళ్లతో తన బంధం గురించి.. ఇలా అనేక విషయాలు పంచుకున్నారు.

Also See : Ratan Tata Old Photos : రతన్ టాటా రేర్ ఫొటోలు. రతన్ టాటా పాత ఫొటోలు చూశారా..?

రతన్ టాటా డాక్యుమెంటరీలో పలువురు తన కుటుంబ సభ్యులతో పాటు తన కంపెనీ ప్రముఖులు కూడా మాట్లాడారు. రతన్ టాటా డాక్యుమెంటరీ ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో చూడొచ్చు. ఈ డాక్యుమెంటరీ తెలుగు, హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని వీడియోలు మాత్రం యూట్యూబ్ లో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో చూడొచ్చు.

ఇక గతంలోనే రతన్ టాటా బయోపిక్ పై వార్తలు వచ్చాయి. సూర్యతో ఆకాశమే నీ హద్దురా సినిమా తీసిన సుధా కొంగర రతన్ టాటా బయోపిక్ తీస్తుందని గతంలో వార్తలు రాగా ఆమె ఆ బయోపిక్ తీయట్లేదని క్లారిటీ ఇచ్చేసింది. మరి ఇప్పుడు టాటా మరణం తర్వాత ఎవరైనా ఆయన బయోపిక్ తీస్తారేమో చూడాలి.