ఆర్‌కామ్ దివాలా

  • Publish Date - May 10, 2019 / 04:45 AM IST

అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్ మే 09వ తేదీ గురువారం ఆమోదం తెలిపింది. ఆర్ కామ్ బోర్డును రద్దు చేసి, సంస్థ నిర్వాహణ కోసం నూతన ఆర్‌పీని నియమించింది. రుణదాతల కమిటీగా ఏర్పడేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 31 బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీని ఫలితంగా బ్యాంకులకు రూ. 50 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆర్‌కామ్‌ ప్రస్తుతం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటితోనే తమకు 357 రోజుల గడువు ఇవ్వాలని (మే 30, 2018 నుంచి ఏప్రిల్‌ 30, 2019 వరకు) దివాలా ప్రాసెస్‌ను నిలిపివేయాలని కోరింది. ట్రైబ్యునల్స్‌ రిలయన్స్‌ ఇనఫ్రా టెల్‌, రిలయన్స్‌ టెలికంతో పాటు ఆర్‌కామ్‌కు కొంత గడువు ఇచ్చింది. 

గత రెండేళ్లుగా ఆర్‌కామ్‌కు కష్టాలు ఎదురవుతున్నాయి. దివాలా చట్టం కోడ్ నుండి తప్పించుకొనేందుకు ఆర్‌కామ్ వద్ద ఉన్న స్పెక్ట్రమ్‌ను రిలయన్స్‌ జియోకు విక్రయించాలనుకుంది. దీనికి కొన్ని అడ్డంకులు రావడంతో ముందుకు సాగలేదు. డిపార్ట్‌మెం ట్‌ ఆఫ్‌ టెలికం (డాట్‌) తమ బకాయిలు తీర్చేవరకు స్పెక్టమ్‌ విక్రయించడానికి అనుమతించమని స్పష్టం చేసింది. దీంతో అమ్మకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బకాయిలు చెల్లిస్తానని, ఆస్తులు అమ్ముతామని అనిల్ అంబానీ బహిరంగంగానే వ్యాఖ్యలు చేసినా ఒక్కటి అమలు కాలేదు. 
ఎరిక్సన్‌కు రూ. 480 కోట్ల చెల్లింపునకు సంబంధించి, సోదరుడు ముకేశ్ అంబానీ ఆదుకోవడంతో సుప్రీంకోర్టు ధిక్కరణ కేసులో జైలు పాలయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.