Realme Narzo 70x 5G : రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 24నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme Narzo 70x 5G : భారత మార్కెట్లో ఏప్రిల్ 24న రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Realme Narzo 70x 5G : రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 24నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme Narzo 70x 5G Launch on April 24 and bunch of its details

Updated On : April 19, 2024 / 5:38 PM IST

Realme Narzo 70x 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి ఈ ఏడాదిలో ఇప్పటికే 6 స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. లేటెస్టుగా రియల్‌మి పైప్‌లైన్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ ధృవీకరించింది. ఇందులో రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ, ఎంట్రీ లెవల్ రియల్‌మి సి65 5జీ ఫోన్లు ఉన్నాయి. రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ లాంచ్ ఏప్రిల్ 24న లాంచ్ చేయనుంది. అయితే, రియల్‌మి సి65 5జీ ఫోన్ లాంచ్ తేదీని ఇంకా రివీల్ చేయలేదు.

Read Also : Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీగా ధర తగ్గింపు.. ఇంతకీ, ఈ ఫోన్ కొనాలా వద్దా?

రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ రిలీజ్ తర్వాత కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది. రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ డిజైన్, కెమెరా ఫీచర్లు రియల్‌మి 70 ప్రో 5జీ మాదిరిగానే ఉండనున్నాయి. హాఫ్-మూన్ డిజైన్, వృత్తాకార కెమెరా మాడ్యూల్‌తో రానుంది. అయితే, నార్జో 70 ప్రో 5జీ ఫోన్ గ్రీన్ కలర్‌కు బదులుగా నార్జో 70ఎక్స్ ఆకర్షణీయమైన బ్లూ కలర్ ఆప్షన్‌లో రానుంది.

రియల్‌మి అధికారిక ప్రకటన ప్రకారం.. :
నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ 45డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ 5జీ ఫోన్ ధర రూ. 12వేల లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతం, 45డబ్ల్యూ ఛార్జింగ్ స్పీడ్‌ని అందించే రూ. 15వేల కేటగిరీలో 3 స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే ఉన్నాయి. రియల్‌మి పి1 5జీ, టెక్నో పోవా 5, రియల్‌మి 12ఎక్స్ 5జీ, నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ ఈ సెగ్మెంట్‌లోని రియల్‌మి 12ఎక్స్ 5జీతో నేరుగా పోటీపడే అవకాశం ఉంది. రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్.. నార్జో 70ఎక్స్ మాదిరిగానే ఫ్లాట్ డిస్‌ప్లే, మాట్ ఫినిష్ బ్యాక్, ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని టీజర్ ధృవీకరిస్తుంది.

రియల్‌మి ఈ ఏడాదిలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసింది. రియల్‌మి 12ప్రో, రియల్‌మి 12 ప్రోప్లస్‌, ఆ తర్వాత రియల్‌మి 12, రియల్‌మి 12 ప్లస్‌తో సహా రియల్‌‌మి12 సిరీస్, ఆపై రియల్‌మి 12ఎక్స్, రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఉన్నాయి. రియల్‌మి ఇటీవలే రియల్‌మే పి1 5జీతో భారత్‌లో పి సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, రియల్‌మి పి-సిరీస్ లాంచ్ చేసిన కొద్దిరోజులకే.. కంపెనీ నార్జో 70ఎక్స్ 5జీని ఏప్రిల్ 24న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది.

Read Also : Vivo V30e Launch : మే 2న వివో V30e 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్, భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?