Realme P3 Pro 5G : భలే డిస్కౌంట్ భయ్యా.. రియల్‌మి లవర్స్ ఈ 5G ఫోన్ అసలు వదులుకోవద్దు.. ఎందుకంటే?

Realme P3 Pro 5G : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి P3 ప్రో 5G ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Realme P3 Pro 5G

Realme P3 Pro 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అతి తక్కువ ధరకే రియల్‌మి P3 5G ఫోన్ కొనేసుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. రియల్‌మి నుంచి P3 ప్రో 5Gని సొంతం చేసుకోవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ డీల్ పొందవచ్చు.

6,000mAh బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లేతో నడిచే రియల్‌మి P3 ప్రో 5G ఫోన్ ఇప్పుడు 17 శాతం ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో కొనుగోలుదారులు ఈ 5జీ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.

Read Also : Apple iPhone 16 Pro : సూపర్ ఆఫర్.. లక్ష ఖరీదైన ఆపిల్ ఐఫోన్ 16ప్రో భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే? ఇప్పుడే కొనేసుకోండి!

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి P3 ప్రో 5G ధర :
వాస్తవానికి, రియల్‌మి P3 ప్రో 5G ఫోన్ (8GB+128GB) స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ బచత్ సేల్ సందర్భంగా రూ.23,999 తగ్గింపు ధరకు లభిస్తుంది.

అదనపు డిస్కౌంట్లు, ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ : కస్టమర్లకు రూ. 23,150 వరకు డిస్కౌంట్
నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ : రూ. 2వేల వరకు

రియల్‌మి P3 ప్రో 5G : స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

1. డిస్‌ప్లే, ప్రాసెసర్ :
డిస్‌ప్లే : 6.7-అంగుళాల అమోల్డ్ స్క్రీన్
రిఫ్రెష్ రేట్ : 120Hz స్మూత్ స్క్రోలింగ్
ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 5G చిప్‌సెట్

2. కెమెరా సెటప్ :
ప్రైమరీ షూటర్ : 50MP
సెకండరీ షూటర్ : 2MP
ఫ్రంట్ షూటర్ : సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరా

3. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ :
బ్యాటరీ : 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఒక రోజంతా ఛార్జింగ్ వస్తుంది.
ఛార్జింగ్ : 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

4. సాఫ్ట్‌వేర్ సపోర్టు :
వాటర్ రెసిస్టెన్స్ : IP69 సర్టిఫికేషన్‌తో వస్తుంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ : ఈ హ్యాండ్‌సెట్ 2 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్ మరో 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కలిగి ఉంటుంది.

Read Also : Money Saving Tips : మీకు జీతం పడగానే ఈ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. రూ.కోటి వరకు ఈజీగా సంపాదించొచ్చు..!

5. కనెక్టివిటీ ఆప్షన్లు

  • 5G కనెక్టివిటీ
  • Wi-Fi
  • బ్లూటూత్
  • GPS సపోర్టు

రియల్‌మి P3 ప్రో 5G కొనాలా? :
పవర్‌ఫుల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz అమోల్డ్ డిస్‌‍ప్లే, 50MP కెమెరా వంటి టాప్ రేంజ్ ఫీచర్లతో రియల్‌మి P3 ప్రో 5G మిడ్-రేంజ్ 5G సెగ్మెంట్‌లో అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.