చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ నుంచి ఇండియా మార్కెట్లలో బుధవారం (సెప్టెంబర్ 25, 2019)మధ్యాహ్నం 12 గంటలకు కొత్త మోడల్ లాంచ్ అయింది. రెడ్ మి ఎ-సిరీస్, రెడ్ మి 7Aతో సక్సెస్ సాధించిన రెడ్ మి బ్రాండ్.. మరో కొత్త మోడల్ Redmi 8A స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది.
ఈ ఫోన్ రెండు వేరియంట్లు (2GB ర్యామ్ + 32GB స్టోరేజీ + 3GBర్యామ్ + 32GB స్టోరేజీ)తో మార్కెట్లోకి వచ్చింది. రెడ్ మి 8Aలో HD+డిస్ ప్లే స్క్రీన్ ఉంది. బ్యాక్ సైడ్.. సింగిల్ 12MP రియర్ కెమెరాతో పాటు 5,000mAh బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే ఐదు రోజుల వరకు వస్తుంది.
ఇదివరకే రెడ్ మి ఇండియా రెడ్ మి 8ఎ ఫోన్ లాంచింగ్ డేట్ కు సంబంధించి అధికారిక ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇందులో సన్నని బెజిల్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వాటర్ డ్రాప్ నాచ్ కూడా ఉంది. Redmi 8A స్మార్ట్ ఫోన్ సేల్ సెప్టెంబర్ 29న మధ్యాహ్నాం 11:59ల నుంచి Mi.com, Flipkart వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటుంది.
ఇండియన్ మార్కెట్లో Redmi 8A బేసిక్ ఫోన్ ధర రూ.6వేల 499గా కంపెనీ నిర్ణయించింది. మరో వేరియంట్ (3GBర్యామ్ + 32GB స్టోరేజీ) ఫోన్ ధర రూ.6వేల 999గా నిర్ణయించింది. Redmi 8A ఫోన్ మొత్తం మూడు కలర్లలో (రెడ్, బ్లూ, బ్లాక్, ఆరా డిజైన్)తో లభ్యం కానుంది.
ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* స్నాప్ డ్రాగన్ 439 SoC
* 12MP రియర్ కెమెరా
* Sony IMX363 సెన్సార్
* 8MP సెల్ఫీ కెమెరా (ఫ్రంట్)
* 5,000mAh బ్యాటరీ
* USB Type-C ఛార్జింగ్ పోర్ట్
* 18W ఫాస్ట్ ఛార్జింగ్
* 2GB RAM + 32GB స్టోరేజీ
* 3GB RAM + 32GB స్టోరేజీ
* వైర్ లెస్ FM Radio