జియో ఫైబర్ (Fiber -to-the-home) FTTH సర్వీసును తీసుకుంటున్నారా? జియో ఫైబర్ యూజర్లకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా జియో ఫైబర్ సర్వీసును మొదటి రెండు నెలలు ఉచితంగా పొందవచ్చు. అందరికి కాదండోయ్.. కేవలం ప్రీమియం కస్టమర్లకు మాత్రమేనట. ప్రీవ్యూ ఆఫర్ కింద ఎవరైతే ట్రయల్ కనెక్షన్ వాడుతున్నారో వారికి మాత్రమే ఫస్ట్ రెండు నెలల వరకు ఉచితంగా జియో ఫైబర్ సర్వీసు అఫర్ చేస్తోంది. 2018లో జరిగిన AGM సమావేశంలో జియో గిగాఫైబర్ సర్వీసును తొలుత రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జియో గిగాఫైబర్ ప్రీవ్యూ ఆఫర్ కింద ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో యూజర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2500 చెల్లించాల్సి వచ్చింది. ఇదివరకే ప్రివ్యూ కనెక్షన్ తీసుకున్న యూజర్లందరికి జియో ఫైబర్ అధికారికంగా లాంచ్ అయినప్పటి నుంచి మొదటి రెండు నెలల వరకు ఉచితంగా సర్వీసును పొందే అవకాశం ఇస్తోంది. ప్రీవ్యూ కస్టమర్లు.. సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించిన రూ.2500లను ఎప్పుడంటే అప్పుడు రిఫండ్ చేసుకోవచ్చునని ఓ నివేదిక తెలిపింది. జియో గిగాఫైబర్ సర్వీసును Jio Fiberగా మార్చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ సెప్టెంబర్ 5న ఫైబర్ సర్వీసును కమర్షియల్ లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
కొత్త జియో ఫైబర్ కస్టమర్లు.. సర్వీసు లాంచ్ అయ్యాక ముందుగా రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఇన్ స్టాలేషన్ ఛార్జీలు రూ.1000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తిగల యూజర్లు రియలన్స్ జియో అధికారిక వెబ్ సైట్ jio.com విజిట్ చేసి Jio Fiber రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రారంభంలో జియో ఫైబర్ సర్వీసు ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ ఎంపిక చేసిన నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, జైపూర్, హైదరాబాద్, సూరత్, వడోదర, చెన్నై, నోయిడా, ఘాజియాబాద్, భువనేశ్వర్, వరణాసి, అలహాబాద్, బెంగళూరు, ఆగ్రా, మీరట్, వైజాగ్, లక్నో, జమ్సేద్ పూర్, హరిద్వార్, గయ, పట్నా, పొర్ట్ బ్లెయిర్, పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో జియో ఫైబర్ సర్వీసు అందుబాటులోకి రానుంది.
రిలయన్స్ జియో ఫైబర్ ప్రారంభ డేటా ప్లాన్ రూ.700తో 100Mbps స్పీడ్ ఇంటర్నెట్ ఆఫర్ చేస్తోంది. హై ఎండ్ డేటా ప్లాన్ రూ.10వేలతో 1Gbps వరకు హైస్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది. మొత్తం డేటా ప్లాన్లు, టారిఫ్ పూర్తిగా ప్రకటించలేదు. సెప్టెంబర్ 5న జియో ఫైబర్ సర్వీసులో మొత్తం డేటా టారిఫ్ ప్లాన్లు ఎన్నో ఉన్నాయో ప్రకటించే అవకాశం ఉంది. రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసు కనెక్షన్ కోసం ఇప్పటివరకూ 1.5 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. భవిష్యత్తులో దేశంలో 2 కోట్లుకు పైగా నివాసాల్లో 16వందల నగరాల్లో 1.5 కోట్ల బిజినెస్ కావడమే లక్ష్యంగా రిలయన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.