Google Payకు పోటీగా: Jioలోనూ UPI పేమెంట్ వచ్చేసింది

  • Publish Date - January 21, 2020 / 09:22 AM IST

దేశీయ టెలికం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్ పై కూడా దూసుకెళ్తోంది. తక్కువ ధరకే ఎక్కువ మొబైల్ డేటా అందించి డేటా విప్లవానికి తెరలేపిన జియో.. డిజిటల్ పేమెంట్స్ సంస్థలకు పోటీగా UPI పేమెంట్ విధానం కూడా అమల్లోకి తీసుకొస్తోంది. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజాలైన గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లకు ధీటుగా రిలయన్స్ జియో యూపీఐ పేమెంట్స్ ప్రవేశపెట్టింది. ప్రస్తుత My Jio Appలోనే సరికొత్త UPI పేమెంట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు ఈజీగా యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేసుకోవచ్చు. 

ఈ కొత్త ఆప్షన్.. JioMoney వ్యాలెట్ సహా వివిధ ఇతర జియో Apps లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. రానున్న రోజుల్లో JioSaavn, JioCinema యాప్స్ కూడా యాక్సస్ చేసుకునేలా UPI పేమెంట్స్ ఆప్షన్ ఎనేబుల్ చేయనుంది. ఈ UPI ఆప్షన్ కు టెలికం ఆపరేటర్ సపరేటు పేరు పెట్టే యోచనలో ఉంది. ఏది ఏమైనా.. ఈ ఆప్షన్.. కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 

ఈ UPI పేమెంట్ ఆప్షన్ ఎనేబుల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే.. మీ ఫోన్ లోని My Jio Appలోకి వెళ్లి చూడండి.. UPI పేమెంట్ ఆప్షన్ కనిపించలేదంటే ఇంకా మీకు అందుబాటులోకి రానట్టే.. రిలయన్స్ జియో ఒకసారి పబ్లిక్ లోకి వచ్చాక.. Jio UPI కూడా ఇతర డిజిటల్ పేమెంట్స్ యాప్స్ మాదిరిగానే యూజర్లందరూ అన్ని ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. మరోవైపు ఇండియాలో వాట్సాప్ కూడా డిజిటల్ పేమెంట్స్ UPI సర్వీసును త్వరలో ప్రవేశపెట్టనుంది. 

Jio UPI పేమెంట్ ఎలా వాడాలంటే? :

* Google Pay, Paytm, PhonePe మాదిరిగానే ఈ Jio UPI కూడా పనిచేస్తుంది. 
* వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPI)తో పాటు UPI హ్యాండిల్ @Jio అని ఉంటుంది.
* వ్యాలీడ్ మొబైల్ నెంబర్, Bank అకౌంట్ వివరాలతో Sign Up అవ్వాల్సి ఉంటుంది.
* ఇక్కడ మీరు UPI PIN సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 
* మీరు Add చేసిన బ్యాంకు అకౌంట్లలోకి ఈజీగా Money పంపుకోవచ్చు.