Reliance Swadesh Store : హైదరాబాద్‌లో రిలయన్స్ రిటైల్ ఫస్ట్ ‘స్వదేశ్‌’ స్టోర్‌.. నీతా అంబానీ చేతుల మీదుగా ప్రారంభం

Reliance Retail first swadesh store opens in hyderabad

Reliance Swadesh Store : ప్రముఖ రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ హైదరాబాద్‌‌లో ‘స్వదేశ్’ స్టోర్ ప్రారంభించింది. జూబ్లీహిల్స్‌, రోడ్‌ నెం.36, అల్కజార్‌ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ స్వదేశ్‌ స్టోర్‌‌ను రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్‌పర్సన్ నీతా అంబానీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇదే తొలి స్వదేశ్ స్టోర్ కావడం విశేషం. అతి పెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌తో హస్త కళలను ఆదరించడం, హస్తకళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఏర్పాటు చేశారు.

Read Also : Reliance Jio Ookla Awards : జియోనే నెం.1.. ఏకంగా 9 అవార్డులతో అగ్రస్థానం.. ప్రపంచంలోనే తొలి నెట్‌వర్క్..!

ఈ స్టోర్‌లో ప్రత్యేకించి భౌగోళిక గుర్తింపు పొందిన దేశీయ హస్తకళా ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు, చేనేత వస్త్రాలు వంటివి ఉన్నాయి. అంతేకాదు.. హ్యాండీక్రాఫ్ట్స్‌, ఫర్నీచర్‌, ఆర్ట్‌ ఆబ్జక్ట్స్‌, టాయ్స్‌, మాస్క్‌లు, జ్యువలరీ, పప్పట్స్‌, డైనింగ్‌, పెయింటింగ్స్‌, కిచెన్‌కు హోంవేర్‌, షాల్స్‌, అప్పారల్‌, శారీస్‌, హోంలినెన్‌, ఫ్యాబ్రిక్స్‌, వెల్‌నెస్‌ ప్రొడక్టులు కూడా ఈ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన, మంచు లక్ష్మి, పీవీ సింధు, సానియా మీర్జా తదితరులు పాల్గొని సందడి చేశారు.

హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం.. ఫస్ట్ స్టోర్ ఇక్కడే :

స్వదేశ్ స్టోర్ ప్రారంభోత్సం సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ అంటే మాకు చాలా ఇష్టం. మా మొట్టమొదటి రిలయన్స్ రిటైల్ స్టార్ ఇక్కడినుంచే ప్రారంభించాం. ముంబై ఇండియన్స్ కూడా ఈ నగరంలోనే రెండు టైటిల్స్ గెలిచారు. కళాకారులకు మంచి అవకాశం కల్పించడమే స్వదేశ్ స్టోర్ లక్ష్యంగా పెట్టుకున్నాం.

Reliance Retail first swadesh store

హైదరాబాద్ నగర ప్రజలు కూడా మాపై ఎంతో అభిమానాన్ని చూపారు. స్వదేశ్ ప్రయాణం ఈ నగరం నుంచే ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె అన్నారు. కళాకారులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పిచివై పెయింటింగ్స్ మొదటిసారి చూడగానే అవి అంతరిస్తున్నాయని తెలిసి ఎంతో బాదేసిందని చెప్పారు. అప్పుడే మొదటిసారి స్వదేశీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది’ అని అంబానీ అన్నారు.

అమెరికా, యూరప్‌లోనూ స్టోర్ ఏర్పాటు చేస్తాం  : 

కళలు, కళాకారులకు భారత్ నిలయమని ఆమె చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ సహా అమెరికా, యూరోప్‌లోనూ స్వదేశ్ స్టోర్ స్థాపించాలని అనుకుంటున్నామని నీతా తెలిపారు. 40 ఏళ్ల తరువాత భారత్‌లో ఒలెంపిక్ సెషన్ జరగనుందని, వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో స్వదేశ్ స్టోర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని నీతా అంబానీ పేర్కొన్నారు.

Read Also : DDA Diwali Scheme 2023 : కొత్త ఫ్లాట్ కావాలా? సరసమైన ధరకే 30వేల ఫ్లాట్లు.. లొకేషన్ ఎక్కడంటే?

ట్రెండింగ్ వార్తలు