రిలయన్స్ చేతుల్లోకి ఫ్యూచర్ గ్రూప్ రిటైల్‌ బిజినెస్

  • Publish Date - August 30, 2020 / 07:21 AM IST

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌లో రిటైల్ అండ్ హోల్‌సేల్ వ్యాపారాలను కొనుగోలు చేసింది. రూ.24,713 కోట్లు చెల్లించి రిలయన్స్ సంస్థ ఫ్రూచర్ గ్రూప్‌ రిటైల్‌ను కైవసం చేసుకుంది.

వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ బ్లాక్‌బస్టర్‌ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) లేటెస్ట్‌గా కిషోర్‌ బియానీ ప్రమోట్‌ చేస్తున్న ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్‌ విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు శనివారం ప్రకటించింది.

ఈ డీల్‌ విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్‌ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించగా.. వాటిని వినియోగించుకునేందుకు రిలయన్స్‌కు మార్గం ఈ డీల్ ద్వారా సుగమం అయినట్లుగా అయ్యింది.

ఎఫ్ఈఎల్ ఈక్విటీ వారెంట్స్ మీద మరో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. యూనిక్ మోడల్ ద్వారా చిన్న వర్తకులు, కిరాణా దుకాణాదారులతోపాటు పెద్ద కన్జ్యూమర్ బ్రాండ్స్ వరకు అందరినీ కలుపుకొని రిటైల్ ఇండస్ట్రీలో మరింత పురోగతి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్ధ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విలీనం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు