లిమిటెడ్ ఆఫర్ : కార్లపై రూ.3 లక్షలు క్యాష్ డిస్కౌంట్

  • Publish Date - November 22, 2019 / 11:44 AM IST

కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్. ఈ కారు కొంటే రూ.3లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. కానీ, ఈ ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ మాత్రమేనట. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ రెనాల్ట్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలో తమ కార్లపై వందలాది బెనిఫెట్స్ అందిస్తోంది. కార్లు కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.3 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.

ఈ ఆఫర్ నవంబర్ 30, 2019 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెనాల్ట్ ఇండియా కంపెనీ క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేసే కార్ల మోడల్స్ లో డస్టర్, కివిడ్, క్యాప్చర్ కార్లపై మూడు లక్షల వరకు భారీ క్యాష్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన స్టాక్ కార్లలో డస్టర్ కారుపై రూ.1.25 లక్షల వరకు బెనిఫెట్స్ అఫర్ చేస్తోంది. 

అదనంగా లాయాలటీ బోనస్ రూపంలో రూ.10వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.20వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఇక క్విడ్ మోడల్ కార్లపై రూ.50వేల వరకు బెనిఫెట్స్ ఆఫర్ చేస్తోంది. దీనికి అదనంగా 4ఏళ్లు 1లక్ష కిలోమీటర్ల వారంటీ అందిస్తోంది.

ఈ రెండు మోడల్ కార్ల కంటే అతిపెద్ద డిస్కౌంట్ క్యాప్చర్ కార్ మోడల్స్ మాత్రమే కంపనీ ఆఫర్ చేస్తోంది. రెనాల్ట్ క్యాప్చర్.. ఈ ఒక్క కారు మోడల్ పై మాత్రమే రూ.3లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీనిపై కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.5వేల వరకు బెనిఫెట్ పొందవచ్చు. 

రెనాల్ట్ క్విడ్ కార్లపై బెనిఫెట్స్ తో కలిపి మొత్తం రూ.50వేల వరకు ఆఫర్ చేస్తోంది. రెనాల్ట్ క్యాప్చర్ కారు మార్కెట్లలో ప్రారంభ ధర రూ.9.49లక్షలతో అందుబాటులో ఉంది. పెట్రోల్ కారు ధర రూ.11.99 లక్షలుగా ఉంది. ఇక డీజిల్ వేరియంట్ క్యాప్చర్ కారు ప్రారంభ ధర రూ.10.49లక్షలతో అందుబాటులో ఉంది.

(ఎక్స్ షోరూం ఢిల్లీ) ఇతర ట్యాక్స్ లతో కలిపి మొత్తం కారు ధర రూ.12.99లక్షలుగా ఉంది. క్యాప్చర్ కార్లపై బెనిఫెట్స్ వేరియంట్స్ ఆధారంగా మారుతాయి. క్యాప్చర్ కారు బెనిఫెట్స్ నవంబర్ 30, 2019 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.