Reliance: భారత కార్పొరేట్ రంగంలో అతి పెద్ద ఇష్యూ.. రూ. 30వేల కోట్లు సమీకరించిన RIL

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) మూడు విడతలుగా అమెరికన్ డాలర్‌లకు బాండ్ల విక్రయం ద్వారా 4 బిలియన్ డాలర్లు అంటే రూ.30వేల కోట్లను సమీకరించినట్లు ఎక్స్‌ఛేంజీలకు వెల్లడించింది.

RIL: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) మూడు విడతలుగా అమెరికన్ డాలర్‌లకు బాండ్ల విక్రయం ద్వారా 4 బిలియన్ డాలర్లు అంటే రూ.30వేల కోట్లను సమీకరించినట్లు ఎక్స్‌ఛేంజీలకు వెల్లడించింది. భారతీయ కంపెనీ విదేశీ కరెన్సీ బాండ్ల విక్రయాల్లో ఇదే అతిపెద్దది అని ఆర్‌ఐఎల్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

రిలయన్స్ రిటైల్ భారతదేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ డన్జోలో 25.8 శాతం వాటాను $ 200 మిలియన్లకు (సుమారు రూ. 1,488 కోట్లు) కొనుగోలు చేసింది. ఆన్‌లైన్ కిరాణా డెలివరీ వ్యాపారంలో తన ఉనికిని విస్తరించుకోవడానికి రిలయన్స్ రిటైల్ ఈ పెట్టుబడి పెట్టింది.

దేశంలోనే అతిపెద్ద వేగవంతమైన వాణిజ్య వ్యాపారంగా Dunzoని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, మైక్రో వేర్‌హౌస్‌ల నెట్‌వర్క్ నుండి అవసరమైన వస్తువులను వెంటనే డెలివరీ చేసేందుకు వీలు కల్పించనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.

అమెరికన్ డాలర్‌లకు బాండ్‌లను విక్రయించగా.. అవి ఫిబ్రవరిలో మెచ్యూర్ అయ్యే $1.5 బిలియన్ల రుణంతో సహా ఇప్పటికే ఉన్న రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి ప్లాన్ చేస్తుంది రిలయన్స్.

ఆయిల్-టు-టెలికామ్ గ్రూప్ ద్వారా 10 సంవత్సరాల ఇష్యూలో 2.875 శాతం వడ్డీకి $1.5 బిలియన్లు, 30 సంవత్సరాల ఒప్పందంతో 3.625 శాతం వద్ద $1.75 బిలియన్లు.. 40 సంవత్సరాల ఇష్యూలో 3.75 శాతం వడ్డీతో $750 మిలియన్లు సేకరించింది. దీని చెల్లింపు వ్యవధి 2032 నుండి 2062 సంవత్సరాల మధ్య ఉంటుంది.

జపాన్ వెలుపల BBB-రేటెడ్ ఆసియా కంపెనీ 40 సంవత్సరాల డాలర్ బాండ్‌ను జారీ చేయడం ఇదే మొదటిసారి. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ S&P BBB+ రేటింగ్, మూడీస్ BAA 2 రేటింగ్ ఇచ్చింది. ఆసియా, యూరప్, అమెరికా దేశాలు బాండ్ల కోసం ఆర్డర్లు వస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.