Royal Enfield Bullet 650
Royal Enfield Bullet 650 : బుల్లెట్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. గ్లోబల్ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 మోటోవర్స్ 2025లో ప్రవేశపెట్టింది. చాలా మంది రైడర్లు, క్రూయిజ్ ఔత్సాహికులకు బుల్లెట్ కేవలం బైక్ కాదు.. తరతరాల నాటి క్రేజ్.. ఇప్పుడు, ఫస్ట్ టైమ్ ఈ ఐకానిక్ మోటార్ సైకిల్ ట్విన్-సిలిండర్ పర్ఫార్మెన్స్‌తో భారతీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. కంపెనీ ఇంకా ధరను ప్రకటించలేదు. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 బైక్ 2026 మొదటి త్రైమాసికంలో అమ్మకానికి రానుంది.
క్లాసిక్ బుల్లెట్ లుక్ :
బుల్లెట్ 650 ఫ్యాన్స్ ఇష్టపడే అదే క్లాసిక్ బుల్లెట్ (Royal Enfield Bullet 650) ఫీచర్లు కలిగి ఉంది. లాంగ్, లో బాడీ, వెడల్పు గల సింగిల్-పీస్ బెంచ్ సీటు సౌకర్యవంతంగా జర్నీ చేయొచ్చు. ఫ్యూయిల్ ట్యాంక్ చేతితో పెయింట్ గోల్డ్ పిన్‌స్ట్రిప్స్ వింగ్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్యాడ్జ్‌ను కలిగి ఉంది. “కాస్కెట్” పేరుతో సిగ్నేచర్ హెడ్‌ల్యాంప్ హౌసింగ్‌లో రౌండ్ హెడ్‌లైట్ ఐకానిక్ “టైగర్ ఐ” ఇండికేటర్‌లు ఉన్నాయి.
ఇప్పుడు మోడ్రాన్ టచ్ కోసం LED లైటింగ్‌తో అప్‌గ్రేడ్ అయింది. ఈ బైక్ క్రోమ్ పీషూటర్ ఎగ్జాస్ట్‌ను కూడా కలిగి ఉంది. వింటేజ్ బిగ్-బైక్ లుక్‌ను అందిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 కానన్ బ్లాక్, బాటిల్ షిప్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గోల్డ్ కలర్ రెట్రో-స్టయిల్ గ్రాఫిక్స్ కలిగి ఉన్నాయి.
ధర రూ.3.17 లక్షలు (అంచనా) :
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 అనేది రాబోయే మోడల్. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.80 లక్షల నుంచి రూ.3.17 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆన్-రోడ్ ధరలు రూ. 3.4 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కచ్చితమైన లాంచ్ తేదీ నిర్ధారించలేదు. 2026 చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
బుల్లెట్ 650 రాయల్ ఎన్‌ఫీల్డ్ 647.95cc ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇంటర్‌సెప్టర్ కాంటినెంటల్ GT 650లకు కూడా పవర్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 46.4bhp, 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మృదువైన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ రేసింగ్ కోసం కాదు. కానీ, స్పీడ్ పవర్ డెలివరీ, స్ట్రాంగ్ మిడ్-రేంజ్ పర్ఫార్మెన్స్ ఈజీ క్రూజింగ్ కోసం ట్యూన్ అయింది.
హార్డ్‌వేర్ :
బుల్లెట్ 650లో స్టీల్ ట్యూబులర్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 120mm బ్యాక్ సైడ్ 90mm సస్పెన్షన్ ట్రావెల్ భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉంటుంది. గట్టి భూభాగాల్లో కూడా వేగంగా వెళ్లగలదు. ఈ బైక్‌లో 19-అంగుళాల ఫ్రంట్ వీల్, 18-అంగుళాల బ్యాక్ వీల్ ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABSతో 320mm ఫ్రంట్, 300mm రియర్ డిస్క్ బ్రేక్‌లు బ్రేకింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
ఇతర ఫీచర్లలో 800mm సీటు ఎత్తు, 154mm గ్రౌండ్ క్లియరెన్స్, 243 కిలోల కెర్బ్ బరువు, 14.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650కి క్లాసిక్ మోడ్రాన్ హంగులను కలిపి అందించింది. అందులో పాలిషడ్ రెట్రో స్విచ్ గేర్, రోటరీ నాబ్స్, స్మాల్ డిజిటల్ డిస్‌ప్లేతో అనలాగ్-స్టైల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ LED హెడ్‌ల్యాంప్ ఉన్నాయి.
ఇన్స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఫ్యూయిల్ లెవల్, గేర్ లోకేషన్, ట్రిప్ డేటా సర్వీస్ రిమైండర్‌ల వంటి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. బుల్లెట్ 650తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఔత్సాహికులకు అద్భుతమైన అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. అలాగే, బుల్లెట్ క్లాసిక్ అప్పీల్‌ను అడ్వాన్స్ ఫీచర్లతో యువ రైడర్‌లను మరింతగా ఆకర్షిస్తోంది.