Royal Enfield Himalayan 450 to get a price hike from January 1
Royal Enfield Himalayan 450 Price : ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోడల్ హిమాలయన్ 450 బైక్ ధర పెరగనుంది. వచ్చే జనవరి 1, 2024 నుంచి ధర పెంచనున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. అంటే.. ప్రస్తుత హిమాలయన్ 450 బైక్ ప్రారంభ ధర రూ. 2.69 లక్షల నుండి రూ. 2.84 లక్షల మధ్య ఉంది.
ఇందులో 450సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్, రైడ్-బై-వైర్, 4-అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్, రైడ్ మోడ్‌లు, స్విచబుల్ ఏబీఎస్ ఉన్నాయి. కొత్త మోడల్‌లో రీడిజైన్ చేసిన స్టీల్ ట్విన్-స్పార్ ఫ్రేమ్, 43ఎమ్ఎమ్ యూఎస్‌డీ ఫోర్క్‌లు, ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. కస్టమర్‌లు డిసెంబర్ 31 వరకు ఈ ప్రారంభ ధరలకే కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత రంగు మారితే కొత్త ధర అందుబాటులోకి వస్తుంది.
హిమాలయన్ 450 బైక్ ప్రారంభ ధరలివే :
రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో హిమాలయన్ 450ని 2023 మోటోవర్స్‌లో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరలు రూ. 2.69 లక్షల నుంచి ఎక్స్-షోరూమ్, బేస్ కాజా బ్రౌన్ ఉంటాయి. టాప్-ఆఫ్-ది-లైన్ సమ్మిట్ ట్రిమ్ హాన్లే బ్లాక్ కామెట్ వైట్ పెయింట్ స్కీమ్‌ల ధరలు వరుసగా రూ. 2.79 లక్షలు నుంచి రూ. 2.84 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ఉంటాయి. హిమాలయన్ 450 450సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్, 40ఎన్ఎమ్ గరిష్ట టార్క్ వద్ద 40హెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.
కొత్త హిమాలయన్‌లో రైడ్-బై-వైర్, నావిగేషన్, మీడియా కంట్రోల్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 4-అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్, రైడ్ మోడ్‌లు (ఎకో, పెర్ఫార్మెన్స్), స్విచబుల్ ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కొత్త హిమాలయన్ పూర్తిగా రీడిజైన్ చేసిన స్టీల్ ట్విన్-స్పార్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది.
Royal Enfield Himalayan 450 price hike
సస్పెన్షన్ డ్యూటీలకు 43ఎమ్ఎమ్ యూఎస్‌డీ ఫోర్క్‌లు, ప్రీలోడ్-ఎడ్జెస్ట్ మోనోషాక్‌ను కలిగి ఉంది. ఈ రెండూ 200ఎమ్ఎమ్ ప్రయాణాన్ని అందిస్తాయి. 230ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్‌తో, స్టాక్ సీట్ ఎత్తు 825ఎమ్ఎమ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అదనంగా, 845మిమీకి పెంచడానికి లేదా ఆప్షనల్ తక్కువ సీట్ యాక్సెసరీతో 805మిమీకి తగ్గించడానికి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.
జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి :
డిసెంబర్ 31లోపు ఆన్‌లైన్ లేదా షోరూమ్‌ల ద్వారా బుకింగ్ చేసుకునే కస్టమర్లు ఈ ప్రారంభ ధరలను పొందవచ్చు. అయితే, జనవరి 1 నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఎవరైనా ఒక కస్టమర్ జనవరి 1 లోపు బైక్‌ను బుక్ చేసుకున్నప్పటికీ, కొత్త సంవత్సరంలో రంగు మార్పును ఎంచుకుంటే.. కొత్త ధర వర్తిస్తుందని డీలర్లు చెబుతున్నారు. మరోవైపు, డిసెంబర్ 31లోపు రంగు మార్పు జరిగితే.. వినియోగదారుడు ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు.