Top 5 Upcoming SUVs in 2024 : హ్యుందాయ్ క్రెటా నుంచి నిస్సాన్ ఎక్స్-ట్రైల్ వరకు రాబోయే టాప్ 5 ఎస్‌యూవీ కార్లు ఇవే..
Top 5 Upcoming SUVs in 2024 : కొత్త కారు కోసం చూస్తున్నారా? 2024లో కొత్త ఎస్‌యూవీ కార్లు విడుదల కానున్నాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్, కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్, టాటా కర్వ్, మహీంద్రా థార్ 5-డోర్, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఉండనున్నాయి.

Top 5 upcoming SUVs in 2024
Top 5 Upcoming SUVs in 2024 : భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో ఎస్‌యూవీ మోడల్ కార్లకు మరింత డిమాండ్ పెరుగుతోంది. ఈ మల్టీఫేస్ వెహికల్స్ రోడ్లపై అత్యంత పాపులర్ మోడళ్లుగా మారాయి. 2024లో రాబోయే కొత్త కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అనేక కార్ల తయారీదారులు కొత్త, ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ మోడళ్లను దించేందుకు సిద్ధమవుతున్నారు. 2024లో భారత మార్కెట్లో అరంగేట్రం చేయబోయే ఐదు అత్యంత ఎదురుచూస్తున్న ఎస్‌యూవీల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ :
హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీలో క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను 2024 జనవరి 16న విడుదల చేయనుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌లతో పోటీగా హ్యుందాయ్ క్రెటా రెండు ముఖ్యమైన అప్‌డేట్‌లను అందుకోనుంది. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)ని ప్రవేశపెట్టడం అనేది కీలకమైన అప్‌డేట్లలో ఒకటి. అదనంగా, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. పోటీదారు కియా సెల్టోస్ మాదిరిగా పవర్ ఆప్షన్లతో రానుంది.

2024 Hyundai Creta facelift
2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ :
కొత్త మోడల్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కియా సోనెట్ కారు జనవరి 2024 విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే బుకింగ్‌లు మొదలయ్యాయి. కియా సోనెట్ మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 300లకు బలమైన పోటీదారుగా నిలుస్తుంది.
ఫేస్‌లిఫ్టెడ్ సోనెట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎల్ఈడీ సౌండ్-యాంబియంట్ లైటింగ్, కనెక్ట్ చేసిన 10.25-అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ నావిగేషన్, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానెల్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. సరౌండ్ వ్యూ మానిటర్, 70కి పైగా కనెక్ట్ చేసిన కార్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో హై-సేఫ్టీ ప్యాకేజీతో కూడిన 25 సెక్యూరిటీ ఫీచర్లు, 10 అడాస్ ఫీచర్లు ఉన్నాయి.

2024 Kia Sonet facelift
టాటా కర్వ్ :
హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి పోటీదారులను లక్ష్యంగా చేసుకుని 2024లో రానున్న టాటా మోటార్స్ కర్వ్ (Curvv) గేమ్-ఛేంజర్‌గా మారుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కర్వ్ మోడల్ వినియోగదారులకు ఐసీఈ, ఈవీ ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంటుందని అంచనా. నిర్దిష్ట వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ 400 నుంచి 500కిలోమీటర్ల వరకు క్లెయిమ్ పరిధిని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Tata Curvv
మహీంద్రా థార్ 5-డోర్ :
మహీంద్రా 2024లో థార్ 5-డోర్‌ను లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. మారుతి సుజుకి జిమ్నీ, రాబోయే ఫోర్స్ గూర్ఖా 5-డోర్‌లకు పోటీగా రానుంది. భారత మార్కెట్లో స్పైడ్ టెస్టింగ్, థార్ 5-డోర్‌లో వృత్తాకార ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మాదిరి ఇతర అప్‌డేట్‌లు ఉంటాయి.

Mahindra Thar 5-door
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ :
నిస్సాన్ నుంచి మాగ్నైట్ సక్సెస్ తర్వాత నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ను మార్చి 2024 తర్వాత భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఫోర్త్ జనరేషన్ ఎక్స్-ట్రైల్, ప్రస్తుతం భారత మార్కెట్లో ట్రయల్స్ జరుగుతున్నాయి. అలయన్స్ సీఎంఎఫ్-సి ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. బలమైన హైబ్రిడ్, తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్‌లను అందిస్తుంది. 12.3-అంగుళాల డిజిటల్ క్లస్టర్, టచ్‌స్క్రీన్, అడాస్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్‌లతో ఎక్స్-ట్రయల్ విలాసవంతమైన సాంకేతికంగా అధునాతన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Nissan X-Trail
ఈ రాబోయే ఎస్‌యూవీలు కఠినమైన ఆఫ్-రోడర్‌ల నుంచి అధునాతన అర్బన్ క్రూయిజర్‌ల వరకు భారతీయ వినియోగదారులకు విభిన్న ప్రాధాన్యతలను అందించనున్నాయి. అధునాతన ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలు, అద్భుతమైన పర్పార్మెన్స్ అన్నింటిపై దృష్టిసారిస్తూ 2024 ఎస్‌యూవీల లైనప్ దేశం మార్కెట్లో ఎస్‌యూవీ క్రేజ్‌ను మరింత పెంచనున్నాయి.
Read Also : Apple iPhone 15 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!