S Jayashankar on Indian Economy
Indian Economy: ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వేంగా వృద్ధి చెందుతుందని, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనే ఆశాభావం తమకుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం సౌది అరేబియలో ఉన్న ఆయన.. శనివారం సౌది అరేబియాలోని భారత సంతతి ప్రజలతో మాట్లాడుతూ భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం తాము గట్టిగా కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు.
‘‘క్రెడిట్, బ్యాంకింగ్, విద్య, కార్మిక విధానాలను మార్చగలిగే మార్గాల గురించి భారత దేశం ఆలోచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, అత్యధిక ఆదాయంగల దేశంగా మారడానికి బలమైన ప్రయత్నాలు చేస్తున్నాం. దీని కోసం దార్శనికత, వివేకంతో ఆర్థిక వనరుల నిర్వహణ అవసరం. చాలా కీలక సంస్కరణలు అమలవుతున్నాయని, వీటి ఫలితాలను స్పష్టంగా చూడవచ్చు. 2021 మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో మునుపెన్నడూ లేనంత ఎక్కువ ఎగుమతులు చేశాం. మొత్తం ఎగుమతుల విలువ 670 బిలియన్ డాలర్లు అని వివరించారు. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ప్రపంచం ధరల పెరుగుదల సమస్యను ఎదుర్కొంటోంది. అయితే భారత దేశం ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందనే నమ్మకం నాకు ఉంది. కనీసం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది’’ అని అన్నారు.
Operation Maha: మహారాష్ట్రలో మరో సంక్షోభం.. శరద్ పవార్ పార్టీ నేతలు గెట్టు దాడుతున్నారా?