వర్షాకాలంలో టాటా ఏఐజీ మోటర్ ఇన్సూరెన్స్‌‌తో సురక్ష

మరింత సమాచారం కోసం www.tataaig.comలో చూడొచ్చు.

TATA AIG Motor Insurance: దేశంలోని బీమా దిగ్గజాల్లో ఒకటైన టాటా ఏఐజీ ఈ వర్షాకాలంలో వాహనాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర వాహన బీమా పథకాలను అందిస్తోంది. వర్షాకాలం రావడంతోనే, వరదలొచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ఉండేవారి వాహనాలకు నీటి సంబంధిత నష్టాల రిస్కులు పెరుగుతాయి. అయితే, ఇలాంటి సీజనల్‌ పరమైన సవాళ్లను అధిగమించేందుకు విస్తృతమైన కవరేజీ, సర్వీసులతో టాటా ఏఐజీ అందించే వాహన బీమా పాలసీలతో వాహనదార్లు నిశ్చింతగా ఉండొచ్చు.

ఇంజిన్‌కు భద్రత: వర్షాల కారణంగా నీరు చొరబడటం వల్ల లేదా ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ కారు ఇంజిన్‌ దెబ్బతింటే రక్షణ ఉంటుంది.

గ్లాస్, ఫైబర్, ప్లాస్టిక్, రబ్బర్ భాగాల మరమ్మతు: మొత్తం భాగాన్ని మార్చేయాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న డ్యామేజీలను మరమ్మతు చేయొచ్చు. తద్వారా నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ)కి కూడా ఢోకా ఉండదు. డిప్రిసియేషన్ రీయింబర్స్‌మెంట్ కవర్ కూడా ఉంటుంది.

వోల్టేజీ పెరుగుదలపరమైన నష్టాల నుంచి రక్షణ: ఆర్కింగ్, సెల్ఫ్-హీటింగ్, విద్యుత్ లీకేజీ లేదా నీరు చొరబడటం వల్ల షార్ట్-సర్క్యూట్ కావడం కారణంగా తలెత్తే నష్టాన్ని లేదా డ్యామేజీని భర్తీ చేస్తుంది.

ఎన్‌సీబీ ప్రొటెక్షన్ కవర్: ఎన్‌సీబీపై ప్రభావం పడకుండానే క్లెయిమ్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. మీ ఎన్‌సీబీతో ప్రీమియం రెన్యువల్ సమయంలో 50 శాతం వరకు డిస్కౌంటు లభించవచ్చు.

టోయింగ్, ఆన్-రోడ్ రిపేర్: మీ కారు గానీ ఆగిపోతే ఉచిత టోయింగ్, రిపేర్ సర్వీసులను పొందవచ్చు. రోడ్ సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) కవర్ వల్ల కేవలం ఒక్క కాల్ చేస్తే సహాయం సత్వరం పొందవచ్చు.

10,000+ గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్: వివిధ ప్రాంతాల్లో రిపేర్ సర్వీసులను పొందవచ్చు. తద్వారా డౌన్‌టైమ్, అసౌకర్యం తగ్గుతుంది.

99% క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి: సత్వరం రికవర్ అయ్యేందుకు విశ్వసనీయమైన, సత్వరమైన క్లెయిమ్స్ ప్రాసెసింగ్ ప్రక్రియను అందిస్తున్నారు.

సులభతరంగా, సత్వరంగా పాలసీ జారీ: కేవలం మూడు దశల్లోనే పాలసీ జారీ అవుతుంది.

24×7 అసిస్టెన్స్: ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నా సత్వరం సహాయం అందించేందుకు ఇరవై నాలుగు గంటలూ ప్రత్యేక సపోర్ట్ టీమ్ అందుబాటులో ఉంటుంది.

టాటా ఏఐజీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అయిదు కోట్ల పైచిలుకు కస్టమర్లకు సర్వీసులు అందిస్తోంది. గత ఏడాది ఒక కోటికి పైగా పాలసీలు జారీ చేసింది. మరింత సమాచారం కోసం tataaig.comలో చూడొచ్చు.

Also Read: భారీ వర్షాలు.. అస్తి, ప్రాణ నష్టం జరిగింది: రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు